Samuel Badree named West Indies assistant coach for white-ball leg of SA tour - Sakshi
Sakshi News home page

WI vs SA: దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్‌ సిరీస్‌.. క్రికెట్‌ వెస్టిండీస్‌ కీలక నిర్ణయం!

Published Wed, Mar 8 2023 3:54 PM | Last Updated on Wed, Mar 8 2023 4:11 PM

WI vs SA: Samuel Badree named West Indies assistant coach - Sakshi

దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు క్రికెట్‌ వెస్టిండీస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీని వారి కొత్త అసిస్టెంట్ కోచ్‌గా క్రికెట్‌ వెస్టిండీస్‌ నియమించింది. అయితే బద్రీ కేవలం దక్షిణాఫ్రికాతో జరిగే వైట్-బాల్ సిరీస్‌లో మాత్రమే తన సేవలందిస్తాడు. ప్రోటీస్‌ పర్యటన అనంతరం పూర్తి స్థాయి అసిస్టెంట్ కోచ్‌ను క్రికెట్‌ విండీస్‌ నియమించనుంది.

కాగా బద్రీ గతంలో వెస్టిండీస్‌ స్పిన్-బౌలింగ్ సలహాదారుగా కూడా పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా బద్రీకి ఉంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల వైట్‌బాల్‌ సిరీస్‌లో తలపడనుంది.

ఇప్పటికే ప్రోటీస్‌ చేతిలో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన విండీస్‌.. ఇప్పుడు రెండో టెస్టులో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. విండీస్‌-ప్రోటీస్‌ మధ్య రెండో టెస్టు మార్చి8 నుంచి ప్రారంభమైంది.

అదే విధంగా ఈస్ట్‌ లండన్‌ వేదికగా మార్చి 16న జరగనున్న తొలి వన్డేతో విండీస్‌ వైట్‌బాల్‌ టూర్‌ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సిరీస్‌ల నుంచే విండీస్‌ వన్డే, టీ20 కెప్టెన్‌లుగా షాయ్ హోప్,రోవ్‌మన్ పావెల్‌ తమ ప్రయాణాన్ని మొదలపెట్టనున్నారు.
చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. స్టీవ్‌ స్మిత్‌ కీలక నిర్ణయం! స్టార్‌ ఆటగాడికి నో ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement