సెయింట్ జార్జెస్: వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా అంపైర్ వ్యవహరించిన తీరుపై ప్రొటీస్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విండీస్ బౌలర్ మెకాయ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా 2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జరిగిన చివరి టీ20లో గెలుపొంది 3–2తో పర్యాటక జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా... దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 19 ఓవర్‌లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్.. ముల్దర్‌కు షార్ట్ బాల్‌ను సంధించాడు. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. నిజానికి అది వైడ్‌బాల్. కానీ అంపైర్లు మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. డేల్ స్టెయిన్ ఈ అంశంపై ట్విటర్ వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కాడు.
‘‘ఈ భూమి మీద.. అది ఎలా వైడ్‌గా పరిగణించరో చెప్పగలరా’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు స్పందనగా... ‘‘షాకర్’’ అంటూ ఏబీ డివిలియర్స్ అతడిని సమర్థించాడు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ సైతం.. ‘‘ఇది నిజంగా చెత్త అంపైరింగ్’’ అని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మార్క్‌రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
Worst umpiring ever 🤣🤣🤣 pic.twitter.com/4fd9DwRy74
— ribas (@ribas30704098) July 4, 2021
Comments
Please login to add a commentAdd a comment