సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మిల్లర్.. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మిల్లర్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. అతడితో పాటు ప్రోటీస్ పేసర్ మగాల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొన్న మగాల 2 సిక్స్‌లు, ఒక్క ఫోరు సాయంతో 18 పరుగులు చేశాడు.
ఇక వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 11 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment