టీమిండియాతో టీ20 సిరీస్‌.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి | Lungi Ngidi ruled out of T20I series, Beuran Hendricks set to replace him | Sakshi
Sakshi News home page

IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి

Published Sat, Dec 9 2023 10:03 AM | Last Updated on Sat, Dec 9 2023 10:29 AM

Lungi Ngidi ruled out of T20I series, Beuran Hendricks set to replace him - Sakshi

PC: ICC

స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ పేసర్‌ లుంగి ఎంగిడి గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎంగిడి ఎడమ కాలి చీలమండకు గాయమైంది. ఈ క్రమంలోనే అతడిని టీ20 జట్టు నుంచి దక్షిణాఫ్రికా క్రికెట్‌ రిలీజ్‌ చేసింది. ఈ స్టార్‌పేసర్‌ వన్డే సిరీస్‌కూ దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.

                                                           

ఇక టీ20 సిరీస్‌లో ఎంగిడీ స్ధానాన్ని వెటరన్‌ పేసర్‌ బ్యూరాన్ హెండ్రిక్స్‌తో సౌతాఫ్రికా సెలక్టర్లు భర్తీ చేశారు. 2014లో ప్రోటీస్‌ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన హెండ్రిక్స్‌.. ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి  25 వికెట్లు తీశాడు. ఇక ఆదివారం(డిసెంబర్‌ 10)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది.

భారత టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్‌, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement