రాణించిన బట్లర్‌, ఎంగిడి.. రాయల్స్‌ ఖాతాలో మూడో విజయం | SA20 2023: Paarl Royals Beat Pretoria Capitals By 6 Wickets | Sakshi
Sakshi News home page

SA20 2023: రాణించిన బట్లర్‌, ఎంగిడి.. రాయల్స్‌ ఖాతాలో మూడో విజయం

Published Sun, Jan 22 2023 9:11 PM | Last Updated on Sun, Jan 22 2023 9:39 PM

SA20 2023: Paarl Royals Beat Pretoria Capitals By 6 Wickets - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2023లో పార్ల్‌ రాయల్స్‌ టీమ్‌ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 13 పాయింట్లు) ఎగబాకింది. మరోవైపు సీజన్‌లో రెండో ఓటమి చవిచూసినా క్యాపిటల్స్‌ తన అగ్రస్థానాన్ని (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 18 పాయింట్లు) పదిలంగా కాపాడుకుంది. ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌, సూపర్‌ కింగ్స్‌, సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో వరుసగా 2, 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. 

క్యాపిటల్స్‌తో సాదాసీదాగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన రాయల్స్‌.. లుంగి ఎంగిడి (4-0-19-1), ఫెరిస్కో ఆడమ్స్‌ (4-0-38-2), ఇవాన్‌ జోన్స్‌ (3-0-25-1), ఫోర్టిన్‌ (4-0-32-1), షంషి (4-0-29-1) రాణించడంతో ప్రత్యర్ధిని నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులకు కట్టడి చేసింది. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కుశాల్‌ మెండిస్‌ (37), థెనిస్‌ డి బ్ర్యూన్‌ (53) రాణించారు.

అనంతరం రాయల్స్‌.. జట్టులో అందరూ తలో చేయి వేయడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జోస్‌ బట్లర్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్‌ రాయ్‌ (21), విహాన్‌ లుబ్బే (29), డానీ విలాస్‌ (24), డేవిడ్‌ మిల్లర్‌ (28 నాటౌట్‌), మిచెల్‌ వాన్‌ బురెన్‌ (12 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, ఈథన్‌ బోష్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.    


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement