Pretoria Capitals
-
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్‌టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో గురువారం ఏంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 32 సిక్స్‌లు బాదారు. ఆఖరికి ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌టౌన్ విజయం సాధించింది. రికెల్టన్ విధ్వంసం.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ కూడా ఆఖరిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా కెప్టెన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. వెర్రెయిన్నే సెంచరీ వృథా.. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విరోచిత సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడికి మరో ఆటగాడు సపోర్ట్‌గా నిలిచివుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఏంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పొలార్డ్, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరగడంతో ప్రిటోరియా 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్లు విల్ జాక్స్(12), సాల్ట్(10) మినహా మిగితా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. వారెల్ మూడు, మార్కో జానెసన్ రెండు వికెట్లు సాధించారు. అయితే జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రిటోరియా 52 పరుగులకే ఆలౌట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. క్యాపిటల్స్ జట్టులో ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, రూసో, నీషమ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా 52 పరుగులకే ఆలౌటైన ప్రిటోరియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ప్రిటోరియా నిలిచింది. 6.5 ఓవర్లలోనే.. 53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 6. 5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ప్రిటోరియా చవిచూసింది. చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు! -
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడి విధ్వంసం.. 18 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ డొనొవన్ ఫెరియెరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫెరియెరా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న ఫెరియెరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. వెర్రిన్ (52 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఫెరియెరా మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆఖర్లో కెప్టెన్ వేన్ పార్నెల్ 22, ఆదిల్ రషీద్ 15, విల్జోన్ 10 పరుగులు చేయడంతో క్యాపిటల్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మెరుపు వీరులు ఫిల్ సాల్ట్ (12), విల్ జాక్స్ (1), రిలీ రొస్సో (0), ఇంగ్రామ్ (0), జిమ్మీ నీషమ్ (6) తక్కువ స్కోర్లకే ఔటై నిరుత్సాహపరిచారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, లిజాడ్ విలియమ్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టగా.. నండ్రే బర్గర్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ కింగ్స్.. ఫెరియెరా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 18 ఓవర్లలోనే విజయతీరాలకు (4 వికెట్ల నష్టానికి) చేరింది. సూపర్ కింగ్స్‌లో ఫెరియెరాతో పాటు మఖన్యా (40), డు ప్లూయ్ (33), మొయిన్ అలీ (25 నాటౌట్) రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఆదిల్ రషీద్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల్లో సూపర్ కింగ్స్‌కు ఇది తొలి విజయం. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
30 ఏళ్లకే కెరీర్ ముగించిన సౌతాఫ్రికా క్రికెటర్
Theunis De Bruyn: సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన డి బ్రూన్.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్ .. 2018లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఇదే అతని కెరీర్లో ఏకైక సెంచరీ. ఇది మినహా డి బ్రూన్ కెరీర్లో కనీసం అర్ధసెంచరీ కూడా లేదు. టీ20ల్లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడిన డి బ్రూన్.. కేవలం 26 పరుగులు మాత్రమే సాధించాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డి బ్రూన్ తన ఆరాధ్య క్రికెటర్లతో డ్రెస్సింగ్ షేర్ చేసుకోవడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. కాగా, డి బ్రూన్ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లీగ్‌లో క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది. SA20 ఇనాగురల్ లీగ్‌లో 238 పరుగులు చేసిన డి బ్రూన్.. ఎడిషన్ సెకెండ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ.. తొలి మినీ ఐపీఎల్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. CHAMPIONS‼️‼️‼️@SunrisersEC are the winners of the inaugural #Betway #SA20 🏆 The title is heading to Gqeberha‼️@Betway_India pic.twitter.com/ODHLNdtQke — Betway SA20 (@SA20_League) February 12, 2023 వాన్ డెర్ మెర్వ్ 4, మగాలా, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు, జన్సెన్, మార్క్రమ్ చెరో వికెట్ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. That winning moment 🧡🧡🧡#Betway #SA20 @Betway_India pic.twitter.com/b1uI45aYr0 — Betway SA20 (@SA20_League) February 12, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఆడమ్ రొస్సింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్ (22), కెప్టెన్ మార్క్రమ్ (26), జన్సెస్ (13 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఇనాగురల్ ఎడిషన్ (2023) ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా జొహనెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా వేస్తున్నట్లు లీగ్ కమీషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుందని స్మిత్ వెల్లడించారు. స్థానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం మేరకు రేపు వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్) యాజమాన్యం కొనుగోలు చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫ్రాంచైజీలు తొట్టతొలి ఎస్ఏ20 లీగ్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్)ను మట్టికరిపించి క్యాపిటల్స్.. రెండో సెమీఫైనల్లో జోబర్గ్ సూపర్‌కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)పై విజయం సాధించి సన్‌రైజర్స్ తుదిపోరుకు అర్హత సాధించాయి. పలు మార్పులు చేర్పుల తర్వాత సన్‌రైజర్స్, క్యాపిటల్స్ పూర్తి జట్లు ఇలా ఉన్నాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఆడమ్ రొస్సింగ్టన్ (వికెట్‌కీపర్), టెంబా బవుమా, జోర్డాన్ హెర్మన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, జోర్డన్ కాక్స్, మార్కో జన్సెన్, బ్రైడన్ కార్స్, ఒట్నీల్ బార్ట్‌మన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సిసండ మగాలా, జెజె స్మట్స్, జేమ్స్ ఫుల్లర్, అయబెలేల క్వమేన్, మెసన్ క్రేన్, సరల్ ఎర్వీ, మార్కస్ ఆకెర్మెన్, జనైద్ దావూద్ ప్రిటోరియా క్యాపిటల్స్: ఫిలిప్ సాల్ట్, కుశాల్ మెండిస్, థెయునిస్ డి బ్రూన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్, ఈథన్ బోష్, సెనూరన్ ముత్తుస్వామి, మిగేల్ ప్రిటోరియస్, ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, డేరిన్ డుపావిల్లోన్, జాషువ లిటిల్, విల్ జాక్స్, వేన్ పార్నెల్, క్లైడ్ ఫోర్టిన్, కెమరూన్ డెల్పోర్ట్, షాన్ ఓన్ బర్గ్, మార్కో మరియాస్, షేన్ డాడ్స్వెల్ -
SA20 2023: రాయల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన క్యాపిటల్స్
SA20, 2023 - Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ సీజన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ రికార్డులకెక్కింది. జోహన్నస్బర్గ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. రాయల్స్ జట్టును 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అదరగొట్టిన రొసో ది వాండరర్స్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా- పర్ల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పర్ల్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(22) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్(7) విఫలమయ్యాడు. కెప్టెన్ థియూనిస్ డి బ్రూయిన్ కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఈథన్ బోష్(22) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఫైనల్‌కు ప్రిటోరియా ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్ల్ రాయల్స్‌ను ప్రిటోరియా బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్‌ను బోష్ డకౌట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 19 ఓవర్లకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 124 పరుగులకు ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిలీ రొసో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో సెమీస్ పోరులో.. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ప్రిటోరియా క్యాపిటల్స్. ఇదిలా ఉంటే.. గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ప్రిటోరియాను ఢీకొట్టనుంది. చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత Rilee roared and ROARED LOUD 🐯💙 Watch @Rileerr’s 🔝 knock that powered @PretoriaCapsSA to the #SA20League final 🔥#PCvPR #SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/TLemf48dLW — JioCinema (@JioCinema) February 9, 2023 -
SA20 2023: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్
Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో పర్ల్ రాయల్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. పాయింట్ల పట్టికలో డర్బన్ సూపర్‌జెయింట్స్‌ను వెనక్కి నెట్టి టాప్-4లో చోటు సంపాదించింది. అదరగొట్టిన మెండిస్ సెంచూరియన్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్, పర్ల్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదుకున్న బట్లర్ ఓపెనర్ కుశాల్ మెండిస్ 80(41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇంగ్రామ్ 41 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(10), పాల్ స్టిర్లింగ్(19) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ బ్యాట్ ఝులిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు రాబట్టాడు. ఓటమి పాలైనా అయితే, మిగతా వాళ్లలో ఇయాన్ మోర్గాన్(24), కెప్టెన్ డేవిడ్ మిల్లర్(11) తప్ప ఎవరూ కూడా కనీసం సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. దీంతో 167 పరుగులకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 59 పరుగులతో ఓటమిని మూటగట్టుకుంది. కాగా సెమీస్ బెర్తు కోసం పర్ల్, సూపర్‌జెయింట్స్ పోటీ పడ్డాయి. ఒకవేళ ప్రిటోరియాతో మ్యాచ్‌లో గనుక పర్ల్ జట్టు 62 పరుగుల తేడాతో ఓటమిపాలైతే సూపర్‌జెయింట్స్ సెమీస్‌కు అర్హత సాధించేది. అయితే, బట్లర్ 19వ ఓవర్ వరకు పట్టుదలగా నిలబడి ఈ ప్రమాదం నుంచి జట్టును తప్పించాడు. And he keeps hearts too 💗 pic.twitter.com/Vm3dUGxP0c — Paarl Royals (@paarlroyals) February 7, 2023 The Paarl Royals will have another chance to impress in their #Betway #SA20 semi-final 👍@Betway_India pic.twitter.com/jddWrrRa2P — Betway SA20 (@SA20_League) February 7, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సెమీస్ చేరిన జట్లు ఇవే 1. ప్రిటోరియా క్యాపిటల్స్ 2. జోబర్గ్ సూపర్‌కింగ్స్ 3. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4. పర్ల్ రాయల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఇలా.. 1. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ పర్ల్ రాయల్స్(ఫిబ్రవరి 8) 2. జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(ఫిబ్రవరి 9) చదవండి: Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో.. BGT 2023: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' -
క్లాసెన్ సూపర్ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ప్రిటోరియా క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ విజయభేరి మోగించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటిల్స్ 103 పరుగులకే కుప్పకూలింది. డర్బన్ బౌలర్లలో జూనియర్ డలా మూడు వికెట్లతో ప్రిటోరియా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్, ముల్డర్ తలా రెండు వికెట్లు, టోప్లీ, కీమో పాల్ చెరో ఒక్క వికెట్ సాధించారు. ప్రిటోరియా బౌలర్లలో ఈతాన్ బాష్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ.. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. క్లాసన్ అద్భుతసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. 44 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు బ్రీట్జెక్(21 బంతుల్లో 46), డికాక్(20 బంతుల్లో 43) రాణించారు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉంది. చదవండి: WPL 2023: ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
రాణించిన బట్లర్, ఎంగిడి.. రాయల్స్ ఖాతాలో మూడో విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023లో పార్ల్ రాయల్స్ టీమ్ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 13 పాయింట్లు) ఎగబాకింది. మరోవైపు సీజన్లో రెండో ఓటమి చవిచూసినా క్యాపిటల్స్ తన అగ్రస్థానాన్ని (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 18 పాయింట్లు) పదిలంగా కాపాడుకుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్, సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో వరుసగా 2, 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. Paarl Royals registered a much-needed win for their #SA20 campaign. 📸: Jio Cinema#CricTracker #DavidMiller #PCvPR #SA20 pic.twitter.com/sepbANPv16 — CricTracker (@Cricketracker) January 22, 2023 క్యాపిటల్స్‌తో సాదాసీదాగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన రాయల్స్.. లుంగి ఎంగిడి (4-0-19-1), ఫెరిస్కో ఆడమ్స్ (4-0-38-2), ఇవాన్ జోన్స్ (3-0-25-1), ఫోర్టిన్ (4-0-32-1), షంషి (4-0-29-1) రాణించడంతో ప్రత్యర్ధిని నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులకు కట్టడి చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (37), థెనిస్ డి బ్ర్యూన్ (53) రాణించారు. అనంతరం రాయల్స్.. జట్టులో అందరూ తలో చేయి వేయడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జోస్ బట్లర్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్ రాయ్ (21), విహాన్ లుబ్బే (29), డానీ విలాస్ (24), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్), మిచెల్ వాన్ బురెన్ (12 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
విల్ జాక్స్ ఊచకోత.. చెలరేగిన బేబీ ఏబీడీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌తో నిన్న (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. విల్ జాక్స్ (46 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జాక్స్‌కు జతగా డి బ్రూన్ (23 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో క్యాపిటల్స్ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో క్యాపిటల్స్ బౌలర్లు పార్నెల్ (2/20), ఆదిల్ రషీద్ (2/46), నోర్జే (1/37), నీషమ్ (1/13), ఈథన్ బాష్ (1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (29 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన ఎంఐ బౌలర్లు లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన మరో మ్యాచ్‌లో రబాడ (2/12), రషీద్ ఖాన్ (2/18), జార్జ్ లిండే (2/25), ఓడియన్ స్మిత్ (2/10) రెచ్చిపోవడంతో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగా, ఎంఐ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తా చాటగా.. ఆఖర్లో సామ్ కర్రన్ (15 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్-పార్ల్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. -
దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్ పొట్టి లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్టర్న్ కేప్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోరు బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మన్, మార్కరమ్కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్ ఒకటి, మగల ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్నకు జేజే స్మట్స్ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్ స్టబ్స్ 23, టామ్ అబెల్ 40(నాటౌట్) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు ప్రిటోరియా క్యాపిటల్స్- 193/6 (20) సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్- 170/5 (20) చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది