
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ డొనొవన్ ఫెరియెరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫెరియెరా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న ఫెరియెరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. వెర్రిన్ (52 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఫెరియెరా మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆఖర్లో కెప్టెన్ వేన్ పార్నెల్ 22, ఆదిల్ రషీద్ 15, విల్జోన్ 10 పరుగులు చేయడంతో క్యాపిటల్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మెరుపు వీరులు ఫిల్ సాల్ట్ (12), విల్ జాక్స్ (1), రిలీ రొస్సో (0), ఇంగ్రామ్ (0), జిమ్మీ నీషమ్ (6) తక్కువ స్కోర్లకే ఔటై నిరుత్సాహపరిచారు.
సూపర్ కింగ్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, లిజాడ్ విలియమ్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టగా.. నండ్రే బర్గర్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ కింగ్స్.. ఫెరియెరా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 18 ఓవర్లలోనే విజయతీరాలకు (4 వికెట్ల నష్టానికి) చేరింది. సూపర్ కింగ్స్‌లో ఫెరియెరాతో పాటు మఖన్యా (40), డు ప్లూయ్ (33), మొయిన్ అలీ (25 నాటౌట్) రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఆదిల్ రషీద్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల్లో సూపర్ కింగ్స్‌కు ఇది తొలి విజయం.
Comments
Please login to add a commentAdd a comment