Joburg Super Kings
-
సూపర్ కింగ్స్‌లోకి టీ20 వీరుడు.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మరో జట్టులో భాగమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జొబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మూడు టీ20 లీగ్లలోకాగా డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా జొబర్గ్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్న కాన్వే.. సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్ని టీ20 జట్లకు ఆడుతున్న క్రికెటర్‌గా నిలిచాడు.కివీస్‌తో తెగిన బంధంఇక ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కాన్వే వదులుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కివీస్ బోర్డు గురువారం ధ్రువీకరించింది. మరుసటి రోజే అతడు జొబర్గ్తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. డెవాన్ కాన్వేతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ సైతం వచ్చే ఏడాది జొబర్గ్కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.పొట్టి ఫార్మాట్ వీరుడుకాగా లెఫ్టాండర్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్ తాజా ఎడిషన్ టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 143.62 స్ట్రైక్‌రేటుతో 293 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ సౌతాఫ్రికన్- కివీ ఓపెనర్ 187 మ్యాచ్‌లు ఆడి 6028 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. బొటనవేలికి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్-2024కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ఆరంభమైంది. అరంగేట్ర సీజన్లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్.. ఈ ఏడాది కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు.. జొబర్గ్ రెండు సీజన్లలో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
సూపర్ కింగ్స్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన డర్బన్ సూపర్ జెయింట్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఫైనల్లో అడగుపెట్టింది. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జెయింట్స్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో వియాన్ ముల్డర్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నంద్రే బర్గర్, బ్రెస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, గాలైం తలా వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మొయిన్ అలీ(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డర్బన్ బౌలర్లలో జూనియర్ డాలా 4 వికెట్లతో సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, ప్రిటోరియస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఫిబ్రవరి 10న కేప్‌టౌన్ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తాడొపేడో తెల్చుకోనున్నాయి. -
డుప్లెసిస్ ఊచకోత.. సూపర్ కింగ్స్ సంచలన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది. సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. -
టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్‌లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కూడా!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో పాటు పార్ల్ రాయల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్‌తో కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో స్ధానం కోసం సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, ఏంఐ కేప్‌టౌన్ పోటీపడతున్నాయి. నిప్పులు చేరిగిన సన్‌రైజర్స్ పేసర్లు.. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్‌పోయెల్, జానెసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మాడ్సెన్ (32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ముగించారు. -
జట్టు నిండా విధ్వంసకర వీరులే... కట్ చేస్తే 78 పరుగులకే ఆలౌట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. జోబర్గ్ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. జో బర్గ్ కెప్టెన్ డుప్లెసిస్, రెజా హెండ్రిక్స్, మొయిన్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా 3 వికెట్లతో జోబర్గ్ పతనాన్ని శాసించగా.. స్వాన్‌పోయెల్, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ..11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ఫినిష్ చేశారు. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్ -
SA20, 2024: డుప్లెసిస్ ఊచకోత.. 34 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్‌టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥 JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs — Johns. (@CricCrazyJohns) January 29, 2024 వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్‌స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯 - Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x — Johns. (@CricCrazyJohns) January 30, 2024 అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్‌కు ఇది ఊరట కలిగించే విజయం. -
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడి విధ్వంసం.. 18 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ డొనొవన్ ఫెరియెరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫెరియెరా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న ఫెరియెరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. వెర్రిన్ (52 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఫెరియెరా మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆఖర్లో కెప్టెన్ వేన్ పార్నెల్ 22, ఆదిల్ రషీద్ 15, విల్జోన్ 10 పరుగులు చేయడంతో క్యాపిటల్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మెరుపు వీరులు ఫిల్ సాల్ట్ (12), విల్ జాక్స్ (1), రిలీ రొస్సో (0), ఇంగ్రామ్ (0), జిమ్మీ నీషమ్ (6) తక్కువ స్కోర్లకే ఔటై నిరుత్సాహపరిచారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, లిజాడ్ విలియమ్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టగా.. నండ్రే బర్గర్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ కింగ్స్.. ఫెరియెరా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 18 ఓవర్లలోనే విజయతీరాలకు (4 వికెట్ల నష్టానికి) చేరింది. సూపర్ కింగ్స్‌లో ఫెరియెరాతో పాటు మఖన్యా (40), డు ప్లూయ్ (33), మొయిన్ అలీ (25 నాటౌట్) రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఆదిల్ రషీద్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల్లో సూపర్ కింగ్స్‌కు ఇది తొలి విజయం. -
విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్.. కొనసాగుతున్న రాయల్స్ జైత్రయాత్ర
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. లుంగి ఎంగిడి (3/17), ఓబెద్ మెక్కాయ్ (2/31) ధాటికి 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డు ప్లూయ్ (71) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. రీజా హెండ్రిక్స్ (8), డుప్లెసిస్ (10), మొయిన్ అలీ (18), డొనొవన్ ఫెరియెరా (5), రొమారియో షెపర్డ్ (0) నిరాశపరిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్‌తో పాటు విహాన్ లుబ్బే (39) రాణించడంతో 14.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (5), డేవిడ్ మిల్లర్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో లిజాడ్ విలియమ్స్, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్‌పై విజయంతో రాయల్స్ ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ఉండింది. సన్‌రైజర్స్‌కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్‌లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్‌రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్‌లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
మార్కరమ్ సూపర్ సెంచరీ.. ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అడుగు పెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్బెర్త్ను సన్‌రైజర్స్ ఖారారు చేసుకుంది. సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మార్కరమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 6 సిక్స్‌లు, 6 ఫోర్లుతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు సాధించాడు. పోరాడి ఓడిన సూపర్ కింగ్స్ 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో విజయానికి 14 పరుగుల దూరంలో సూపర్ కింగ్స్ నిలిచిపోయింది. సన్‌రైజర్స్ జట్టులో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే రెండు వికెట్లు, మగాల, జానెసన్, బార్ట్‌మాన్ తలా వికెట్ సాధించారు. ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఢీ జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసి ప్రిటోరియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Womens T20 WC: ధనాధన్ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...! -
SA20 2023: ముగిసిన ‘ముంబై’ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి?
SA20, 2023 - Joburg Super Kings vs MI Cape Town: సౌతాఫ్రికా టీ20- 2023 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఏడో పరాజయం నమోదు చేసిన ఎంఐ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో చెన్నై ఫ్రాంఛైజీకి చెందిన జోబర్గ్ ప్లే ఆఫ్స్‌నకు చేరుకుంది. కాగా జోహన్నస్బర్గ్ వేదికగా ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షాక్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జోబర్గ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్ డుప్లెసిస్, హెండ్రిక్స్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఎంఐ జట్టు సంబరాలు చేసుకుంది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన అన్క్యాప్డ్ ఇంగ్లిష్ బ్యాటర్ లూయీస్ డు ప్లూయీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఆదుకున్న అన్‌క్యాప్ట్ బ్యాటర్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ 48 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిలిగిన వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రషీద్ విఫలం ఎంఐ బౌలర్లలో లిండే ఒకటి, సామ్ కరన్ రెండు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. డెవాల్డ్ బ్రెవిస్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా ఎంఐ బౌలర్లతో పోలిస్తే.. 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చేతులెత్తేశారు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌ను జోబర్గ్ బౌలర్లు ఆది నుంచే దెబ్బకొట్టారు. ఓపెనర్ రాసీ వాన్ డసెన్ 20, వన్‌డౌన్‌లో వచ్చిన గ్రాంట్ రోల్ఫోసన్ 21 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన బేబీ ఏబీడీ 27 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయిన ఎంఐ భారీ ఓటమిని మూటగట్టుకుంది. హృదయం ముక్కలైంది ఈ పరాజయంతో టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎంఐ కేప్‌టౌన్ .. ‘‘మేము ఆరంభ సీజన్‌ను ఇలా ముగించాలనుకోలేదు. అయినా మేమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం’’ అంటూ హృదయం ముక్కలైందంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. మనకేంటీ దుస్థితి? మరోవైపు.. జోబర్గ్ ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లి టైటిల్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ‘‘గత కొన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఏ లీగ్‌లో కూడా ప్లే ఆఫ్స్ చేరుకోలేమా? మనకేంటీ దుస్థితి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన రషీద్ ఖాన్.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పదింట ఎంఐ కేవలం మూడు విజయాలే నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ Not the way we’d have wanted to end our inaugural #SA20 campaign 💔 But a family sticks together and so will we. 🤗💙#OneFamily — MI Cape Town (@MICapeTown) February 6, 2023 .@JSKSA20 solidify the 2️⃣nd spot in the #SA20 points table 💛 Watch the #JSKvMICT match highlights and stay tuned to #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲 for #SA20League action 🏏#SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/hmmpfGLSy2 — JioCinema (@JioCinema) February 6, 2023 Leus du Plooy's innings brought @JSKSA20 fans a lot of joy 🫶 Keep watching #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲#JSKvMICT #SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/BsBbqr1QvX — JioCinema (@JioCinema) February 6, 2023 -
SA20 2023: ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. టోర్నీలో తొలి సెంచరీ నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సౌతాఫ్రికా 20 లీగ్(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. (58 బంతుల్లోనే 113 పరుగులు నాటౌట్) చేసిన డుప్లెసిస్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముందు కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వహించిన డుప్లెసిస్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు.కాగా తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ 2023లో డుప్లెసిస్‌దే తొలి శతకం కావడం విశేషం. ఇక డుప్లెసిస్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు కలిపి 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో జాస్ బట్లర్ 285 పరుగులు(పార్ల్ రాయల్స్ జట్టు) ఉన్నాడు. మంగళవారం వాండరర్స్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(48 బంతుల్లో 65 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హోల్డర్ 28, కైల్ మేయర్స్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ధాటికి 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 45 పరుగులతో రాణించాడు. ఇక గతేడాది ఐపీఎల్లో డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారధ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు షాకిచ్చిన ఆర్సీబీ క్వాలిఫయర్-2లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఖంగుతింది. అలా గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments 🔥#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6 — Betway SA20 (@SA20_League) January 24, 2023 చదవండి: SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
ఫోర్టిన్ మాయాజాలం, మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. రాజస్థాన్, లక్నో జట్ల విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్.. సూపర్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో, సూపర్ జెయింట్స్.. ముంబై కేప్ టౌన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించాయి. తిప్పేసిన రాయల్స్ స్పిన్నర్లు.. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్.. స్పిన్నర్లు ఫోర్టిన్ (3/16), ఇవాన్ జోన్స్ (3/21), తబ్రేజ్ షంషి (1/4) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. వెర్రిన్ (11), అల్జరీ జోసఫ్ (13), విలియమ్స్ (17 నాటౌట్), ఫాంగిసో (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్ 10.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. జోస్ బట్లర్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. తలో చేయి వేసిన ఎంఐని ఓడించిన సూపర్ జెయింట్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్.. రోలోఫ్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో, జార్జ్ లిండే (33), డెలానో పాట్గేయిటర్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో టాప్లే, సుబ్రయెన్, విల్యోన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో కైల్ మేయర్స్ (34), వియాన్ ముల్దర్ (30), హెన్రిచ్ క్లాసిన్ (36), కీమో పాల్ (20 నాటౌట్) తలో చేయి వేసి సూపర్ జెయింట్స్‌ను గెలిపించారు. ఎంఐ బౌలర్లలో ఓలీ స్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండేకు ఓ వికెట్ దక్కింది. కాగా, లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 14) జరుగబోయే మ్యాచ్‌ల్లో ప్రిటోరియ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్లు.. ఎంఐ కేప్ టౌన్-జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. -
SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో నడిచే జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ సూపర్ కింగ్స్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డొనావాన్ ఫెరియెరా (40 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌ను వీరి జోడీ (85 పరుగులు జోడించి) ఆదుకుంది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, అఖిల ధనంజయ, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులకు మాత్రమే పరిమితై ఓటమిపాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 78; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసిన్ (20), ప్రిటోరియస్ (6 బంతుల్లో 14; 2 సిక్సర్లు) తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, మలుసి సిబోటో, డొనావాన్ ఫెరియెరా, ఆరోన్ ఫాంగిసో తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (82 నాటౌట్, ఒక వికెట్) అదరగొట్టిన డొనావాన్ ఫెరియెరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్ ఈస్ట్ర్న్ కేప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేశాయి.