
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది.
జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది.
సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment