South Africa League
-
డుప్లెసిస్ ఊచకోత.. సూపర్ కింగ్స్ సంచలన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది. సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. -
CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా..
South Africa T20 League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ది రాయల్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ భాగం కానుంది. పర్ల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన రాయల్ గ్రూప్.. శుక్రవారం తమ జట్టు పేరును వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ది రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ తమ కొత్త టీ20 ఫ్రాంఛైజీకి ‘పర్ల్ రాయల్స్’గా నామకరణం చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా వచ్చే ఏడాది ఆరంభించనున్న టీ20 టోర్నమెంట్లో పర్ల్ రాయల్స్ ఆడనుంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టును కలిగి ఉన్న రాయల్ గ్రూప్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టుతో బరిలోకి దిగుతోంది. క్రీడా కుటుంబాన్ని విస్తరిస్తున్నాం! తాజాగా తమ క్రీడా కుటుంబంలోకి మరో జట్టును ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో.. ‘‘నూతన ఆవిష్కరణలతో క్రీడల్లో ముందడుగు.. క్రీడలతో సమాజంలో పరివర్తనకై కృషి’’ అంటూ కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు తాము తమ క్రీడా కుటుంబాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు రాయల్ గ్రూప్ వెల్లడించింది. ఈ సందర్భంగా.. పర్ల్ రాయల్స్‌లో చేరనున్న నలుగురు ఆటగాళ్ల పేర్లు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్‌లో భాగమైన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ సహా దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు కోర్బిన్ బోష్(అన్క్యాప్డ్)తో ఒప్పందం చేసుకున్నట్లు రాయల్ గ్రూప్ తెలిపింది. కాగా ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ బట్లర్ 863 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Delivered! They are all yours, #RoyalsFamily. 💗 pic.twitter.com/BC31g75QZ9 — Paarl Royals (@paarlroyals) August 12, 2022 -
దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రీతి జింటా
జట్టును కొన్న కింగ్స్ ఎలెవన్ యజమాని పార్ల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అత్యంత పేలవం. అయినా సరే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న గ్లోబల్ టి20 లీగ్‌లో కూడా ప్రీతి జింటా అడుగుపెట్టింది. ‘స్టెలెన్‌బాష్’ టీమ్‌ను కొనుగోలు చేసింది. కొన్నాళ్ల క్రితం జట్లను వేర్వేరు కంపెనీలు సొంతం చేసుకున్న సమయంలో స్టెలెన్‌బాష్‌ను దక్షిణాఫ్రికాకే చెందిన బ్రిమ్‌స్టోన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుక్కుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలతో బ్రిమ్‌స్టోన్ తాము లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా...ఆ స్థానంలో ఇప్పుడు ప్రీతి జింటా వచ్చింది.