![CSA 20 League: Royals Group Announce Team Name Jos Buttler In - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/13/josbuttler.jpg.webp?itok=uTNv2tdj)
రాజస్తాన్ రాయల్స్ జెర్సీలో జోస్ బట్లర్(PC: IPL/BCCI)
South Africa T20 League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ది రాయల్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ భాగం కానుంది. పర్ల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన రాయల్ గ్రూప్.. శుక్రవారం తమ జట్టు పేరును వెల్లడించింది.
ఈ మేరకు.. ‘‘ది రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ తమ కొత్త టీ20 ఫ్రాంఛైజీకి ‘పర్ల్ రాయల్స్’గా నామకరణం చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా వచ్చే ఏడాది ఆరంభించనున్న టీ20 టోర్నమెంట్‌లో పర్ల్ రాయల్స్ ఆడనుంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టును కలిగి ఉన్న రాయల్ గ్రూప్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టుతో బరిలోకి దిగుతోంది.
క్రీడా కుటుంబాన్ని విస్తరిస్తున్నాం!
తాజాగా తమ క్రీడా కుటుంబంలోకి మరో జట్టును ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో.. ‘‘నూతన ఆవిష్కరణలతో క్రీడల్లో ముందడుగు.. క్రీడలతో సమాజంలో పరివర్తనకై కృషి’’ అంటూ కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు తాము తమ క్రీడా కుటుంబాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు రాయల్ గ్రూప్ వెల్లడించింది.
ఈ సందర్భంగా.. పర్ల్ రాయల్స్‌లో చేరనున్న నలుగురు ఆటగాళ్ల పేర్లు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్‌లో భాగమైన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ సహా దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు కోర్బిన్ బోష్(అన్‌క్యాప్డ్)తో ఒప్పందం చేసుకున్నట్లు రాయల్ గ్రూప్ తెలిపింది. కాగా ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ బట్లర్ 863 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు
MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా..
Delivered! They are all yours, #RoyalsFamily. 💗 pic.twitter.com/BC31g75QZ9
— Paarl Royals (@paarlroyals) August 12, 2022
Comments
Please login to add a commentAdd a comment