CSA T20 Challenge
-
సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్
క్రికెట్ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్ జట్టు ఆవిర్భవించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో లయన్స్.. టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (13), ఫెరియరా (0) లాంటి భారీ హిట్టర్లు ఉన్న టైటాన్స్.. లయన్స్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో గెరాల్డ్ కొయెట్జీ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిపామ్లా (4-0-12-4), మపాకా (4-0-15-2), ఫోర్టుయిన్ (3-0-10-2) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లయన్స్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (44 నాటౌట్), కాన్నర్ ఎస్టర్‌హ్యుజెన్ (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లయన్స్‌ను గెలిపించారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో జుబేర్ హమ్జా 20, రీజా హెండ్రిక్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. టైటాన్స్ బౌలర్లలో గేలియమ్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో లయన్స్‌ను ఇది ఐదో టైటిల్. -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..!
టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) టీ20 ఛాలెంజ్ లీగ్ ఈ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. పొట్టి క్రికెట్లో ఒక్క మ్యాచ్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ లీగ్‌లో భాగంగా టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. గతంలో టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్ల స్కోర్లు కలిపి) 497 పరుగులుగా ఉండింది. 2016లో సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఈ స్కోర్ సాధించాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి. #CSAT20Challenge@Titans_Cricket claim a comfortable 41-run victory over @KnightsCricket in a game that broke the world record for the highest match aggregate in a T20 game - 5⃣0⃣1⃣ 🤯 🗒️ Ball by ball https://t.co/QxPLEjNMQg 📺 SuperSport 208#BePartOfIt #SummerOfCricket pic.twitter.com/yu4wsSfwxH — DomesticCSA (@DomesticCSA) October 31, 2022 ఇదిలా ఉంటే, సీఎస్ఏ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. డెవాల్డ్ బ్రెవిస్ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్ సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి, లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. That record-breaking innings 🤯#CSAT20Challenge #BePartOfIt #SummerOfCricket pic.twitter.com/C7KLkPBHzD — DomesticCSA (@DomesticCSA) November 1, 2022 -
జూనియర్ 'ఏబీడీ' విధ్వంసం.. 57 బంతుల్లో 162 పరుగులు
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టి20 క్రికెట్లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. సీఎస్ఏ చాలెంజ్ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. 35 బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. గేల్ (175), ఫించ్ (172) తర్వాత టి20 క్రికెట్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. కాగా బ్రెవిస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. తద్వారా నైట్స్‌పై 41 పరుగుల తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. ఇక నైట్స్ బ్యాటర్లలో గిహాన్ క్లోయెట్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టైటాన్స్ బౌలర్లలో నైల్ బ్రాండ్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆరోన్ ఫాంగిసో రెండు, బ్రెవిస్, హర్మర్ తలా వికెట్ సాధించారు. చదవండి: బంగ్లాదేశ్‌లో పర్యటించే టీమిండియా ఇదే.. తెలుగు ఆటగాడికి అవకాశం -
సౌతాఫ్రికా కొత్త టీ20 లీగ్ పేరు ఖరారు
CSA T20 League: క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానున్న నయా టీ20 లీగ్‌కు పేరు ఖరారైంది. క్రికెట్ సౌతాఫ్రికా ఈ లీగ్‌కు 'ఎస్ఏ20' లీగ్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు సీఎస్ఏ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఆరు జట్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ యాజమాన్యాలే దక్కించుకోవడంతో క్రికెట్ ప్రేమికలు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పిలుచుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఎస్ఏ20లోనూ ఆటగాళ్లను వేలం ద్వారానే దక్కించుకోనున్నారు. సెప్టెంబర్ 19న ఎస్ఏ20 లీగ్ వేలం ప్రక్రియ మొదలవుతుందని సీఎస్ఎ అధ్యక్షుడు, ఎస్ఏ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. 2023 జనవరి 23 నుంచి ఎస్ఏ20 లీగ్ ప్రారంభమవుతుందని స్మిత్ సూచనప్రాయంగా వెల్లడించాడు. కాగా, ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ రూపంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎస్ఏ20 లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల వివరాలు.. - ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్) - జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) - పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్) - ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) - సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్) - డర్బన్ (లక్నో సూపర్ జెయింట్స్) చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
CSA T20: జట్టు పేరు, ఇద్దరు ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన సన్‌రైజర్స్!
South Africa T20 League- Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ క్రికెట్ మార్కెట్లో అడుగుపెడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది ఈ లీగ్ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనబోయే ఆరు ఫ్రాంఛైజీలలో ఒకటైన పోర్ట్ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసింది. అదే విధంగా వేలం కంటే ముందే తాము ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. దక్షిణాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. హైదరాబాద్ తరఫున ఎయిడెన్ మార్కరమ్ ఐపీఎల్లో ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2022తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తాజా ఎడిషన్‌లో 381 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2021 నుంచి దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు నాలుగు అర్ధ శతకాలు బాదాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఇక ఒట్నీల్ విషయానికొస్తే.. 29 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రైట్ ఆర్మ్ పేసర్‌గా రాణిస్తున్నాడు. సీఎస్ఏ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో నార్తర్న్ కేప్నకు ప్రాతినిథ్యం వహించాడు. డెత్‌ఓవర్ల స్పెషలిస్టుగా అతడికి పేరుంది. ఇప్పటి వరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన అన్క్యాప్డ్ ప్లేయర్.. 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో గతేడాది పాకిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జట్టుకు ఎంపికైనప్పటికీ అనారోగ్య కారణాల వల్ల దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం వేలం కంటే ముందే ఆరు జట్లు ఐదుగురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్, మరొకరు ప్రొటిస్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. View this post on Instagram A post shared by Sunrisers Eastern Cape (@sunrisersec) -
MS Dhoni: బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే.. లేదంటే!
South Africa T20 League: పొట్టి ఫార్మాట్ క్రికెట్లో వినోదాన్ని పంచేందుకు మరో సరికొత్త టీ20 లీగ్ త్వరలోనే ఆరంభం కానుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీతో ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, పేరుకు ఇది ప్రొటిస్ లీగ్ అయినా ఇందులో పాల్గొనబోయే ఆరు జట్లను బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైన ఫ్రాంఛైజీలే కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్ ఫ్రాంఛైజీని ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్, డర్బన్ను లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రిటోరియాను ఢిల్లీ క్యాపిటల్స్, పర్ల్‌ను రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం సీఎస్కే కెప్టెన్, భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని తమ మెంటార్ నియమించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఛాన్సే లేదు! ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా లీగ్‌లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ఒకరు తాజాగా స్పందించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు ఎవరూ కూడా విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ఆడాలని కోరుకుంటే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైన తర్వాతే ఛాన్స్ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. అన్ని సంబంధాలు తెంచుకున్న తర్వాతే! ఈ మేరకు.. ‘‘అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగేంత వరకు ఏ ఒక్క భారత క్రికెటర్.. దేశవాళీ ఆటగాళ్లు సైతం ఇతర లీగ్‌లలో ఆడకూడదనేది సుస్పష్టం. ఒకవేళ ఎవరైనా రానున్న లీగ్‌లలో ఆడాలని కోరుకుంటే బీసీసీఐతో సంబంధాలు అన్నీ తెంచుకున్న తర్వాతే అతడికి ఆ అవకాశం ఉంటుంది’’ సదరు అధికారి పునుద్ఘాటించారు. ఇదిలా ఉంటే సీఎస్కే జొహన్నస్‌బర్గ్ ఫ్రాంఛైజీతో ప్రొటిస్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఒప్పందం చేసుకున్నారు. చదవండి: CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. -
CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా..
South Africa T20 League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ది రాయల్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ భాగం కానుంది. పర్ల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన రాయల్ గ్రూప్.. శుక్రవారం తమ జట్టు పేరును వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ది రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ తమ కొత్త టీ20 ఫ్రాంఛైజీకి ‘పర్ల్ రాయల్స్’గా నామకరణం చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా వచ్చే ఏడాది ఆరంభించనున్న టీ20 టోర్నమెంట్లో పర్ల్ రాయల్స్ ఆడనుంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టును కలిగి ఉన్న రాయల్ గ్రూప్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టుతో బరిలోకి దిగుతోంది. క్రీడా కుటుంబాన్ని విస్తరిస్తున్నాం! తాజాగా తమ క్రీడా కుటుంబంలోకి మరో జట్టును ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో.. ‘‘నూతన ఆవిష్కరణలతో క్రీడల్లో ముందడుగు.. క్రీడలతో సమాజంలో పరివర్తనకై కృషి’’ అంటూ కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు తాము తమ క్రీడా కుటుంబాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు రాయల్ గ్రూప్ వెల్లడించింది. ఈ సందర్భంగా.. పర్ల్ రాయల్స్‌లో చేరనున్న నలుగురు ఆటగాళ్ల పేర్లు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్‌లో భాగమైన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ సహా దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు కోర్బిన్ బోష్(అన్క్యాప్డ్)తో ఒప్పందం చేసుకున్నట్లు రాయల్ గ్రూప్ తెలిపింది. కాగా ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ బట్లర్ 863 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Delivered! They are all yours, #RoyalsFamily. 💗 pic.twitter.com/BC31g75QZ9 — Paarl Royals (@paarlroyals) August 12, 2022 -
CSA T20 League: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా..
CSA T20 League- MI Capetown: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంఐ కేప్‌టౌన్ పేరిట బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో బుధవారం జట్టు పేరును ప్రకటించింది యాజమాన్యం. తాజాగా ఎంఐ కేప్‌టౌన్‌లో భాగం కానున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల వివరాలు వెల్లడించింది. రబడ సహా.. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఎంఐ కేప్‌టౌన్ నిర్మాణ ప్రయాణంలో ముందడుగు పడినందుకు సంతోషంగా ఉంది. రషీద్, కగిసో, లియామ్, సామ్లను మా ఫ్యామిలీ(#OneFamily)లోకి ఆహ్వానించడం ఆనందకరం. ఇక డెవాల్డ్ మాతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దూకుడైన ఆటకు ఎంఐ పర్యాయపదం లాంటిది. ఎంఐ కేప్‌టౌన్.. అలాగే మా ఇతర జట్లు కూడా ఇలాగే ముందుకు సాగుతూ దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరినీ అలరిస్తాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరున్న సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో విదేశీ లీగ్‌లలోనూ ముంబై ఇండియన్స్(ఎంఐ) పేరు కలిసి వచ్చేలా.. సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ పేర్లు పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రొటిస్ యువ సంచలన ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 -
విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు(ఐదుసార్లు) ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ త్వరలోనే మరో రెండు ప్రైవేటు లీగ్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్‌లో ఒక జట్టును.. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్కే టి20 లీగ్‌లో మరొక జట్టును(న్యూ లాండ్స్, కేప్‌టౌడ్) కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్లకు సంబంధించిన పేర్లను రివీల్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates) గా నామకరణం చేసింది. ఇక సౌతాఫ్రికా టి20 లీగ్‌లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ దానికి ముంబై కేప్‌టౌన్ (MI Cape Town) అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ ముంబై(ఎంఐ-MI). ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్.. తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలోకి సరికొత్త ఫ్రాంచైజీలు 'ముంబై ఎమిరేట్స్'.. 'ముంబై కేప్ టౌన్'ను స్వాగతించడం చాలా సంతోషాన్నిస్తుంది.ఎంఐ అనే పేరుతో మాకు క్రికెట్‌కు మించిన అనుబంధం ఉంది. మా తాజా ఫ్రాంచైజీలు కూడా ఎప్పటిలాగే ఒకే నైతికతను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సీఎస్ఏ టి20 లీగ్‌లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్‌టౌన్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ముంబై కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. 🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙 📰 Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🆕 𝕋𝔼𝔸𝕄 💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY 🇦🇪 @MIEmirates 🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7 — Mumbai Indians (@mipaltan) August 10, 2022 చదవండి: The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది' -
జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్, కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా పసుపు రంగు జెర్సీని ధరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. జొహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా.. సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ను డర్బన్ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. చదవండి: Ind Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! -
WC 2023: టీ20 లీగ్ కోసమే వన్డే సిరీస్ రద్దు! ఇది కచ్చితంగా సరైన నిర్ణయమే!
CSA T20 Challenge 2022: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని ప్రొటిస్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సమర్థించాడు. కొత్తగా ప్రవేశపెట్టనున్న టీ20 లీగ్ కోసం బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా బోర్డుతో ఎన్ని సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందన్న స్మిత్.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జనవరి 12 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, దక్షిణాఫ్రికాలో కొత్తగా టీ20 క్రికెట్ లీగ్ ఆరంభించనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా ప్రొటిస్ బోర్డు.. ఆసీస్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రేమ్ స్మిత్ కుదరదు! కానీ, అప్పటికే తమ అంతర్జాతీయ కాలెండర్ నిండిపోయిన కారణంగా తేదీలు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విధిలేక దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో నేరుగా అడుగుపెట్టే అవకాశాలను దక్షిణాఫ్రికా చేజేతులా సంక్లిష్టతరం చేసుకున్నట్లయింది. సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ప్రొటిస్.. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టాలంటే క్వాలిఫికేషన్ రౌండ్ ఆడాల్సిన పరిస్థితి. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరైందే! ఈ విషయంపై తాజాగా స్పందించిన గ్రేమ్ స్మిత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘‘సొంతగడ్డపై ఇలాంటి మ్యాచ్‌లు(టీ20) ఆదాయం తెచ్చిపెడతాయి. మా క్రికెట్ లీగ్ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో అన్ని రకాలుగా చర్చించాం. రీషెడ్యూల్ విషయమై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాం. అయినా, వర్కౌట్ కాలేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా టి20 లీగ్‌కు గ్రేమ్ స్మిత్ కమిషనర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా సెప్టెంబరులో టీమిండియా పర్యటనకు రానున్నట్లు బీసీసీఐ బుధవారం ధ్రువీకరించింది. భారత్‌లో ప్రొటిస్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చదవండి: South Africa T20 League: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్ తలపిస్తోంది Zim Vs Ban: మరీ జింబాబ్వే చేతిలోనా.... అస్సలు ఊహించలేదు! మాకిది ఘోర అవమానం! -
'పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల జట్లలో ఆడనున్నారు'
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్‌లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్‌లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " -
CSA T20 League: డర్బన్ ఫ్రాంచైజీ కోచ్‌గా ప్రొటిస్ మాజీ క్రికెటర్
South Africa T20 League- Lance Klusener: దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో పాల్గొనబోతున్న డర్బన్ ఫ్రాంచైజీకి మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ యజమానులైన ఆర్పీజీ గ్రూప్ డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. క్లూస్నర్ దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. 2004లో చివరిసారి సఫారీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అనంతరం అతను కోచ్‌గా మారాడు. కాగా వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో ఈ టీ20 లీగ్ నిర్వహించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ప్రణాళికలు సిద్ధం చేసోతంది. ఇక ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా!