
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాగా ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్‌లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్‌లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు "
Comments
Please login to add a commentAdd a comment