IPL 2023: Aakash Chopra Suggest IPL RCB Team To Release Mohammed Siraj - Sakshi
Sakshi News home page

IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!

Published Thu, Jun 2 2022 3:14 PM | Last Updated on Thu, Jun 2 2022 8:52 PM

Aakash Chopra Says Siraj One Of Players RCB Can Release Buy Cheaper - Sakshi

మహ్మద్‌ సిరాజ్‌(PC: IPL/RCB)

IPL 2023- RCB: ఐపీఎల్‌ మెగావేలం-2022కు ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఏడు కోట్ల రూపాయలకు రిటైన్‌ చేసుకుంది. గత సీజన్‌లో పర్పుల్‌ క్యాప్‌ గెలిచిన హర్షల్‌ పటేల్‌ను కాదని సిరాజ్‌ను అట్టిపెట్టుకుంది. అయితే, వేలంలో 10.75 కోట్లు వెచ్చించి అతడిని మళ్లీ కొనుగోలు చేసింది. 

ఈ క్రమంలో హర్షల్‌ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు. కానీ, సిరాజ్‌ మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఆడిన 15 మ్యాచ్‌లలో అతడు తీసినవి కేవలం 9 వికెట్లు. సమర్పించుకున్న పరుగులు 514. ఇందులో 31 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలో సిరాజ్‌ బౌలింగ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌ చోప్రా సిరాజ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న సీజన్‌లో వేలానికి ముందే అతడిని రిలీజ్‌ చేయాలని ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. ‘‘మహ్మద్‌ సిరాజ్‌ను ఏడు కోట్లకు రిటైన్‌ చేసుకున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు అతడిని వదిలేయొచ్చు. ఒకవేళ అతడిని రిలీజ్‌ చేస్తే ఎవరిని తీసుకోవాలి? అనేది పెద్ద ప్రశ్న.

నిజానికి అతడి స్థానంలో మరో ఇండియన్‌ బౌలర్‌ను తీసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే.. సిరాజ్‌ను వదిలేస్తే వేలంలో చీప్‌గా కొనుక్కోవచ్చు’’ అని సలహా ఇచ్చాడు. ఇప్పుడు అతడికి ఏడు కోట్ల ధర పలికే సీన్‌ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఈ ఎడిషన్‌లో జోష్‌ హాజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారన్న ఆకాశ్‌ చోప్రా.. ఆకాశ్‌ దీప్‌ సైతం పర్వాలేదనిపించాడన్నాడు. ఒకవేళ సిరాజ్‌ను ఆర్సీబీ రిటైన్‌ చేసుకోవాలని భావిస్తే బాగానే ఉంటుందని, అయితే సీజన్‌ మాత్రం బాగుండదు అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి 👇
Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా
Mohammed Siraj: 'చెత్త ప్రదర్శనతో తక్కువంచనా వేయొద్దు.. నేనేంటో నిరూపించుకుంటా'
IPL 2022: పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ చహల్‌, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement