
ఎంఐ కేప్‌టౌన్ లోగో(PC: MI)
CSA T20 League- MI Capetown: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంఐ కేప్‌టౌన్ పేరిట బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో బుధవారం జట్టు పేరును ప్రకటించింది యాజమాన్యం. తాజాగా ఎంఐ కేప్‌టౌన్‌లో భాగం కానున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల వివరాలు వెల్లడించింది.
రబడ సహా..
ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్‌క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది.
సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఎంఐ కేప్‌టౌన్ నిర్మాణ ప్రయాణంలో ముందడుగు పడినందుకు సంతోషంగా ఉంది. రషీద్, కగిసో, లియామ్, సామ్‌లను మా ఫ్యామిలీ(#OneFamily)లోకి ఆహ్వానించడం ఆనందకరం.
ఇక డెవాల్డ్ మాతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దూకుడైన ఆటకు ఎంఐ పర్యాయపదం లాంటిది. ఎంఐ కేప్‌టౌన్.. అలాగే మా ఇతర జట్లు కూడా ఇలాగే ముందుకు సాగుతూ దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరినీ అలరిస్తాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరున్న సంగతి తెలిసిందే.
క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో విదేశీ లీగ్‌లలోనూ ముంబై ఇండియన్స్(ఎంఐ) పేరు కలిసి వచ్చేలా.. సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ పేర్లు పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రొటిస్ యువ సంచలన ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర..
🇦🇪🤝🇮🇳🤝🇿🇦
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H