
డర్బన్ ఫ్రాంచైజీ కోచ్‌గా క్లూస్‌నర్
South Africa T20 League- Lance Klusener: దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో పాల్గొనబోతున్న డర్బన్ ఫ్రాంచైజీకి మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్‌నర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ యజమానులైన ఆర్‌పీజీ గ్రూప్ డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.
క్లూస్‌నర్ దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. 2004లో చివరిసారి సఫారీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అనంతరం అతను కోచ్‌గా మారాడు. కాగా వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో ఈ టీ20 లీగ్ నిర్వహించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ప్రణాళికలు సిద్ధం చేసోతంది.
ఇక ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి.
చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment