జనవరి 9 నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా వేదికగా SA20-2025 లీగ్ (మూడో ఎడిషన్) మొదలవుతుంది. 30 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడుతుంది.
ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన ఈ లీగ్ ఆరు వేదికల్లో (గెబెర్హా, డర్బన్, పార్ల్, జొహనెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్) జరుగనుంది. ఈ లీగ్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) ఫిబ్రవరి 4న మొదలవుతాయి. ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది.
ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో (2023, 2024) విజేతగా నిలిచింది.
ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్) పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో గత ఎడిషన్లలోలాగే ఒక్కో జట్టు 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ లీగ్‌లో డే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. నైట్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.
ఈ లీగ్‌లోని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో జరుగుతుంది.
జట్ల వివరాలు..
డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసెన్, జోన్-జాన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే కింగ్ (రూకీ).
జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వీస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).
ఎంఐ కేప్ టౌన్: రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రీవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్ , డెలానో పోట్‌గీటర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).
ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌవ్, ఈథన్ బాష్, వేన్ పార్నెల్, సెనూరన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్, డారిన్ డుపావిల్లోన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్‌మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).
పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫార్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలియం, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరియాస్ (రూకీ).
సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఐడెన్ మార్క్‌రామ్, జాక్ క్రాలే (ఇంగ్లాండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హర్మన్, ప్యాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిల్ సిమెలన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ).
Comments
Please login to add a commentAdd a comment