న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మరో జట్టులో భాగమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జొబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
మూడు టీ20 లీగ్‌లలో
కాగా డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా జొబర్గ్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్న కాన్వే.. సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్ని టీ20 జట్లకు ఆడుతున్న క్రికెటర్‌గా నిలిచాడు.
కివీస్‌తో తెగిన బంధం
ఇక ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కాన్వే వదులుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కివీస్ బోర్డు గురువారం ధ్రువీకరించింది. మరుసటి రోజే అతడు జొబర్గ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. డెవాన్ కాన్వేతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ సైతం వచ్చే ఏడాది జొబర్గ్‌కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.
పొట్టి ఫార్మాట్ వీరుడు
కాగా లెఫ్టాండర్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్ తాజా ఎడిషన్ టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 143.62 స్ట్రైక్‌రేటుతో 293 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ సౌతాఫ్రికన్- కివీ ఓపెనర్ 187 మ్యాచ్‌లు ఆడి 6028 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే.. బొటనవేలికి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్-2024కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ఆరంభమైంది. అరంగేట్ర సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్.. ఈ ఏడాది కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు.. జొబర్గ్ రెండు సీజన్లలో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.
చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’
Comments
Please login to add a commentAdd a comment