![Faf du Plessis Takes Stunning Catch in SA20 League](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Duplesisis.jpg.webp?itok=4o_20gL8)
దక్షిణాఫ్రికా టీ20 లీగ్-2025లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. సెంచూరియన్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టింది. 185 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులకే పరిమితమైంది. జోబర్గ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(37), డెవాన్ కాన్వే(30) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో డాసెన్, ఓవర్టన్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ మార్‌క్రమ్(40 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెడింగ్‌హామ్(27), స్టబ్స్(26), జాన్సెన్(23) రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో తహిర్, విల్జోయెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్..
ఇక ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన తహిర్.. తొలి బతిని డేవిడ్ బెడింగ్‌హామ్‌కు ఫ్లైట్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో బెడింగ్‌హామ్ ఆ బంతిని మిడ్-ఆఫ్ దశగా లాఫ్టెడ్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు.
షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి మిడ్-ఆఫ్‌లో ఉన్న 40 ఏళ్ల డుప్లెసిస్ అద్బుత విన్యాసం కనబరిచాడు. ఫాప్ తన ఎడమవైపునకు గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నారు. ఈ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఢీ..
ఇక గురువారం జరగనున్న క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరోవైపు పార్ల్ రాయల్స్ సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.
చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు'
Absolutely FAF-tastic 🤯 Faf du Plessis continues to defy the laws of physics #BetwaySA20 #SECvJSK #WelcomeToIncredible pic.twitter.com/WAnGnTex5P
— Betway SA20 (@SA20_League) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment