
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్‌టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥
— Johns. (@CricCrazyJohns) January 29, 2024
JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs
వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్‌స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు.
JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯
— Johns. (@CricCrazyJohns) January 30, 2024
- Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x
అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్‌కు ఇది ఊరట కలిగించే విజయం.