
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది.
జోబర్గ్ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. జో బర్గ్ కెప్టెన్ డుప్లెసిస్, రెజా హెండ్రిక్స్, మొయిన్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా 3 వికెట్లతో జోబర్గ్ పతనాన్ని శాసించగా.. స్వాన్‌పోయెల్, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ..11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ఫినిష్ చేశారు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్
Comments
Please login to add a commentAdd a comment