సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో గురువారం ఏంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 32 సిక్స్‌లు బాదారు. ఆఖరికి ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌టౌన్ విజయం సాధించింది.
రికెల్టన్ విధ్వంసం..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ కూడా ఆఖరిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా కెప్టెన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు.
వెర్రెయిన్నే సెంచరీ వృథా..
249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విరోచిత సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడికి మరో ఆటగాడు సపోర్ట్‌గా నిలిచివుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఏంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పొలార్డ్, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment