![SA 2023: Pretoria Capitals Beat Sunrisers Eastern Cape By 23 runs - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/13/sat20.jpg.webp?itok=84VI058c)
PC: Sunrisers Eastern Cape
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్ పొట్టి లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది.
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్టర్న్ కేప్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
భారీ స్కోరు
బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మన్, మార్కరమ్‌కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్ ఒకటి, మగల ఒక్కో వికెట్ తీశారు.
ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌నకు జేజే స్మట్స్ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్ స్టబ్స్ 23, టామ్ అబెల్ 40(నాటౌట్) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది.
దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ స్కోర్లు
ప్రిటోరియా క్యాపిటల్స్- 193/6 (20)
సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్- 170/5 (20)
చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
Comments
Please login to add a commentAdd a comment