Philip Salt
-
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్‌దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లివింగ్‌స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్‌ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్‌ను చేజార్చుకుంది. -
ఐపీఎల్ వేలం ఎఫెక్ట్.. బౌలర్‌ను విధ్వంసకర బ్యాటర్లా మార్చేసింది..!
ఐపీఎల్ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డన్లు ఇవాళ జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమను నిర్లక్ష్యం చేశాయని భావించిన ఈ ఇద్దరూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో విధ్వంసకర శతకంతో (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ఆడుతున్న క్రిస్ జోర్డన్ 17 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో (20 బంతుల్లో 59; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. సాల్ట్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది వరుసగా రెండో శతకం కాగా.. జోర్డన్, తాను బౌలర్‌ను అన్న విషయాన్ని మరిచిపోయి, బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. వేలం మరుసటి రోజే ఈ ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోవడంతో ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. వీరిద్దరి విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నాయి. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన సాల్ట్, జోర్డన్లను పట్టించుకోకపోవడం అన్ని ఫ్రాంచైజీలు చేసిన అతి పెద్ద తప్పిదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉంటే ఈ ఇద్దరినీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడించే ప్రయత్నం చేయాలని వారు ఫ్రాంచైజీలకు సూచిస్తున్నారు. Madness from CJ 🤯pic.twitter.com/XLS7wMAsih— CricTracker (@Cricketracker) December 20, 2023 -
సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు!
IPL 2023 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అవుటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. మార్ష్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందని.. తొందరపడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెలరేగిన మార్ష్ ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ ఆల్‌రౌండర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ విధించినన 198 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే ఢిల్లీ తమ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయిన వేళ ఫిలిప్ సాల్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 6 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. ఓవైపు సాల్ట్(35 బంతుల్లో 59 పరుగులు).. మరోవైపు మార్ష్ జోరు చూస్తే ఢిల్లీ టార్గెట్‌ను సులువుగానే ఛేదించేట్లు కనబడింది. ఆట కట్టించిన అకీల్ అయితే, సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే సాల్ట్‌ను అద్భుత రీతిలో పెవిలియన్‌కు పంపగా.. కాసేపటికే అకీల్ హొసేన్ మార్ష్ ఆట కట్టించాడు. 14 ఓవర్ మొదటి బంతికి మార్ష్ సిక్సర్ బాదగా.. మరుసటి బంతికే హొసేన్ బదులు తీర్చుకున్నాడు. ఈ విండీస్ బౌలర్ తన స్పిన్ మాయాజాలంతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. హొసేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మార్ష్ బంతిని గాల్లోకి లేపగా.. రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ క్యాచ్ అందుకోవడంతో మార్ష్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. షాట్ ఎంపికలో కాస్త తెలివి ప్రదర్శించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కొంచెం కూడా తెలివి లేదు ‘‘మిచెల్ మార్ష్ మొదటి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి అద్భుతం చేశాడు. రెండో బంతికి కూడా అదే పునరావృతం చేద్దామని భావించాడు. టీ20 ఫార్మాట్లో దూకుడు అవసరమేనన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఇలాంటి షాట్ ఎంపిక చేసుకోవడం తెలివిగల బ్యాటర్ పనైతే కాదు. మిచెల్ ఇంకాస్త క్లెవర్‌గా ఆలోచించి ఉండాల్సింది. అప్పటికే బౌలర్ మీద ఒత్తిడి పెంచగలిగాడు. అలాంటి సమయంలో తదుపరి బంతిపై ఓ అంచనాకు రాగలడు కదా! బంతి కాస్త స్లోగా వచ్చినట్లు అనిపించింది.. కానీ మార్ష్ లెక్క తప్పింది. తొలి బంతిని సిక్సర్ బాదిన అతడు.. మరుసటి బంతికి బౌలర్ విసిరిన సవాలును స్వీకరించకుండా ఉండాల్సింది’’ అని మైకేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కాగా సాల్ట్, మార్ష్ అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ సాగినా 9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. జట్టు ఓడినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..! IPL 2023: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్ అభిమానులు Turning point of the match? Akeal Hosein gets Mitchell Marsh out for 63!#DC require 60 off the final five overs 👊🏻 Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/LCIOKm5O6p — IndianPremierLeague (@IPL) April 29, 2023 -
దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్ పొట్టి లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్టర్న్ కేప్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోరు బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మన్, మార్కరమ్కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్ ఒకటి, మగల ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్నకు జేజే స్మట్స్ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్ స్టబ్స్ 23, టామ్ అబెల్ 40(నాటౌట్) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు ప్రిటోరియా క్యాపిటల్స్- 193/6 (20) సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్- 170/5 (20) చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది -
ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు (ఫొటోలు)
-
సాల్ట్ విధ్వంసం.. 41 బంతుల్లోనే ఏకంగా! పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
England tour of Pakistan, 2022 - Pakistan vs England, 6th T20I: పాకిస్తాన్- ఇంగ్లండ్.. టీ20 సిరీస్ ఆధిపత్యం కోసం నువ్వా- నేనా అన్న రీతిలో పోటీపడుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ విజయంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేయగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. తగ్గేదేలే అన్నట్లు మరుసటి మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ బృందం 63 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, నాలుగో టీ20లో మాత్రం మొయిన్ అలీ బృందాన్ని దురదృష్ట వెంటాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్ 3 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఐదో మ్యాచ్‌లోనూ పాక్ ఇదే తరహాలో 6 పరుగుల తేడాతో గెలుపొంది 3-2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి గండి కొడుతూ సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మొయిన్ అలీ బృందానికి ఈ విజయం సాధ్యమైంది. సాల్ట్ విధ్వంసం.. పాక్ బ్యాటర్లకు చుక్కలే! పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన సాల్ట్.. 41 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సాల్ట్‌తో పాటు మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్(12 బంతుల్లో 27 పరుగులు), వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ మలన్(18 బంతుల్లో 26 పరుగులు), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ డకెట్(16 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్) అద్భుతంగా రాణించడంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(59 బంతుల్లో 87 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఏడో టీ20 ఇరు జట్లకు కీలకంగా మారింది. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ ఆరో టీ20 మ్యాచ్ స్కోరు: పాకిస్తాన్- 169/6 (20 ఓవర్లలో) ఇంగ్లండ్- 170/2 (14.3 ఓవర్లలో) చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! Majestic 8️⃣7️⃣ not out Captain @babarazam258 led from the front.#PAKvENG | #UKSePK pic.twitter.com/D72m3oCO3E — Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022