ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం.
ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు
1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 2024
2. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 2010
3. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 2019
4. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.
కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు
వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారం
టాస్: ఢిల్లీ.. బ్యాటింగ్
ఢిల్లీ స్కోరు: 153/9 (20)
కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)
ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.
టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).
A clinical bowling performance followed by a solid chase 💪
KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024
Comments
Please login to add a commentAdd a comment