సిక్సర్ బాది మరుసటి బంతికే అవుట్( PC: IPL/BCCI)
IPL 2023 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అవుటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. మార్ష్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందని.. తొందరపడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
చెలరేగిన మార్ష్
ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ ఆల్‌రౌండర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ విధించినన 198 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే ఢిల్లీ తమ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయిన వేళ ఫిలిప్ సాల్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 6 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. ఓవైపు సాల్ట్(35 బంతుల్లో 59 పరుగులు).. మరోవైపు మార్ష్ జోరు చూస్తే ఢిల్లీ టార్గెట్‌ను సులువుగానే ఛేదించేట్లు కనబడింది.
ఆట కట్టించిన అకీల్
అయితే, సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే సాల్ట్‌ను అద్భుత రీతిలో పెవిలియన్‌కు పంపగా.. కాసేపటికే అకీల్ హొసేన్ మార్ష్ ఆట కట్టించాడు. 14 ఓవర్ మొదటి బంతికి మార్ష్ సిక్సర్ బాదగా.. మరుసటి బంతికే హొసేన్ బదులు తీర్చుకున్నాడు. ఈ విండీస్ బౌలర్ తన స్పిన్ మాయాజాలంతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు.
హొసేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మార్ష్ బంతిని గాల్లోకి లేపగా.. రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ క్యాచ్ అందుకోవడంతో మార్ష్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. షాట్ ఎంపికలో కాస్త తెలివి ప్రదర్శించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
కొంచెం కూడా తెలివి లేదు
‘‘మిచెల్ మార్ష్ మొదటి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి అద్భుతం చేశాడు. రెండో బంతికి కూడా అదే పునరావృతం చేద్దామని భావించాడు. టీ20 ఫార్మాట్లో దూకుడు అవసరమేనన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఇలాంటి షాట్ ఎంపిక చేసుకోవడం తెలివిగల బ్యాటర్ పనైతే కాదు. మిచెల్ ఇంకాస్త క్లెవర్‌గా ఆలోచించి ఉండాల్సింది.
అప్పటికే బౌలర్ మీద ఒత్తిడి పెంచగలిగాడు. అలాంటి సమయంలో తదుపరి బంతిపై ఓ అంచనాకు రాగలడు కదా! బంతి కాస్త స్లోగా వచ్చినట్లు అనిపించింది.. కానీ మార్ష్ లెక్క తప్పింది. తొలి బంతిని సిక్సర్ బాదిన అతడు.. మరుసటి బంతికి బౌలర్ విసిరిన సవాలును స్వీకరించకుండా ఉండాల్సింది’’ అని మైకేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా
కాగా సాల్ట్, మార్ష్ అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ సాగినా 9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. జట్టు ఓడినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..!
IPL 2023: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్ అభిమానులు
Turning point of the match?
— IndianPremierLeague (@IPL) April 29, 2023
Akeal Hosein gets Mitchell Marsh out for 63!#DC require 60 off the final five overs 👊🏻
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/LCIOKm5O6p
Comments
Please login to add a commentAdd a comment