ఢిల్లీ: సన్‌రైజర్స్ సొంతగడ్డపై ఆడిన గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడింది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీస్కోరు చేసింది. అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, 1 సిక్స్), క్లాసెన్ (27 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. మార్ష్4 వికెట్లు తీశాడు.
తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులకే పరిమితమైంది. ఫిల్ సాల్ట్ (35 బంతుల్లో 59; 9 ఫోర్లు), మార్ష్(39 బంతుల్లో 63; 1 ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. వీళ్లిద్దరే రెండో వికెట్‌కు 66 బంతుల్లోనే 112 పరుగులు జోడించి ఆశలు పెంచారు. వీరిద్దరు అవుటయ్యాక మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) వార్నర్ (బి) అక్షర్ 67; మయాంక్ (సి) సాహా (బి) ఇషాంత్ 5; త్రిపాఠి (సి) పాండే (బి) మార్ష్10; మార్క్‌రమ్ (సి) అక్షర్ (బి) మార్ష్8; బ్రూక్ (సి) అక్షర్ (బి) మార్ష్0; క్లాసెన్ నాటౌట్ 53; సమద్ (సి) సాహా (బి) మార్ష్28; అకీల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–21, 2–44, 3–83, 4–83, 5–109, 6–162. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, నోర్జే 4–0–44–0, ముకేశ్ 2–0–38–0, మార్ష్4–1–27–4, కుల్దీప్ 3–0–27–0, అక్షర్ పటేల్ 4–0–29–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) భువనేశ్వర్ 0; సాల్ట్ (సి అండ్ బి) మార్కండే 59; మార్ష్(సి) మార్క్‌రమ్ (బి) అకీల్ 63; పాండే (స్టంప్డ్) క్లాసెన్ (బి) అభిషేక్ 1; ప్రియమ్ (బి) మార్కండే 12; సర్ఫరాజ్ (బి) నటరాజన్ 9; అక్షర్ నాటౌట్ 29; రిపాల్ నాటౌట్ 11 ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–0, 2–112, 3–115, 4–125, 5–140, 6–148.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–45–1, అకీల్ 4–0–40–1, నటరాజన్ 4–0–34–1, ఉమ్రాన్ 1–0–22–0, మార్కండే 4–0–20–2, అభిషేక్ 3–0–26–1.
ఐపీఎల్‌లో నేడు
చెన్నైVs పంజాబ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)
ముంబై Vs రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment