IPL 2023: Fans Fight Video Goes Viral During DC Vs SRH Match In New Delhi - Sakshi
Sakshi News home page

IPL 2023 DC VS SRH: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్‌ అభిమానులు

Published Sun, Apr 30 2023 10:38 AM | Last Updated on Sun, Apr 30 2023 12:33 PM

IPL 2023: Fans Fight Video Goes Viral During DC Vs SRH Match In New Delhi - Sakshi

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్‌ 29 రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు హోరాహోరీగా తలపడిన విషయం విధితమే. ఈ ఇరు జట్లు మైదానంలో తలపడితే, వీరికి సంబంధించిన అభిమానులు మాత్రం స్టాండ్స్‌లో ముష్టి యుద్ధానికి దిగారు. ఢిల్లీ-సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ పొట్టు పొట్టు కొట్టుకున్న దృశ్యాలు, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

గొడవకు గల కారణాలు ఇతరత్రా విషయాలు తెలియాల్సి ఉంది. వీడియోను బట్టి చూస్తే ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ, వివాదానికి దారి తీసినట్లు స్పష్టమవుతుంది. ఓ పక్క మ్యాచ్‌ జరుగుతుండగానే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవలో ఫ్యాన్స్‌ బట్టలు చినిగిపోయి, ఫర్నీచర్‌ ధ్వంసమైనట్లు కనిపిస్తుంది. సెక్యూరిటీ వచ్చి సర్ధి చెప్పడంతొ గొడవ సద్దుమణిగినట్లు వీడియోలో చూపించబడింది.

హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌ను కాదని స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు ఈ రెజ్లింగ్‌ ఫైట్‌ను వీక్షించారు. ఫైట్‌ను సెల్‌ఫోన్‌ కెమ​రాల్లో బంధించేందుకు ఎగబడ్డారు. అభిమానులు సన్‌రైజర్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైట్‌ చూడాలని వస్తే వారిని అదనంగా మరో ఫైట్‌ వీక్షించే అవకాశం లభించింది.    ‌  

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. అభిషేక్‌ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్‌), క్లాసెన్‌ (27 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోరుల, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమై, లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

మిచెల్‌ మార్ష్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో (4-1-27-4, 39 బంతుల్లో 63; ఫోర్‌, 6 సిక్సర్లు)తో అదరగొట్టినప్పటికీ ఢిల్లీ విజయం సాధించడలేకపోయింది. మార్ష్‌కు జతగా ఫిల్‌ సాల్ట్‌ (59).. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (29 నాటౌట్‌) సత్తా చాటినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement