Fans fight
-
IPL 2023: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్ అభిమానులు
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 29 రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హోరాహోరీగా తలపడిన విషయం విధితమే. ఈ ఇరు జట్లు మైదానంలో తలపడితే, వీరికి సంబంధించిన అభిమానులు మాత్రం స్టాండ్స్‌లో ముష్టి యుద్ధానికి దిగారు. ఢిల్లీ-సన్‌రైజర్స్ ఫ్యాన్స్ పొట్టు పొట్టు కొట్టుకున్న దృశ్యాలు, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. A fight took place between fans in Delhi during their match against SRH. pic.twitter.com/MYPj6dqejb — Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023 గొడవకు గల కారణాలు ఇతరత్రా విషయాలు తెలియాల్సి ఉంది. వీడియోను బట్టి చూస్తే ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ, వివాదానికి దారి తీసినట్లు స్పష్టమవుతుంది. ఓ పక్క మ్యాచ్ జరుగుతుండగానే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవలో ఫ్యాన్స్ బట్టలు చినిగిపోయి, ఫర్నీచర్ ధ్వంసమైనట్లు కనిపిస్తుంది. సెక్యూరిటీ వచ్చి సర్ధి చెప్పడంతొ గొడవ సద్దుమణిగినట్లు వీడియోలో చూపించబడింది. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌ను కాదని స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు ఈ రెజ్లింగ్ ఫైట్‌ను వీక్షించారు. ఫైట్‌ను సెల్‌ఫోన్ కెమరాల్లో బంధించేందుకు ఎగబడ్డారు. అభిమానులు సన్‌రైజర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైట్ చూడాలని వస్తే వారిని అదనంగా మరో ఫైట్ వీక్షించే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (27 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోరుల, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమై, లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మిచెల్ మార్ష్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో (4-1-27-4, 39 బంతుల్లో 63; ఫోర్, 6 సిక్సర్లు)తో అదరగొట్టినప్పటికీ ఢిల్లీ విజయం సాధించడలేకపోయింది. మార్ష్‌కు జతగా ఫిల్ సాల్ట్ (59).. ఆఖర్లో అక్షర్ పటేల్ (29 నాటౌట్) సత్తా చాటినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. -
వైరల్ : గొడవపడిన కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలు ఇద్దరు ఇద్దరే. బ్యాటింగ్ పరంగా రికార్డుల సృష్టించడంలో ఎవరికి వారే సాటి. మైదానంలో కలిసి ఉన్నట్లే అనిపించినా బయట మాత్రం ఇద్దరు దూరంగా ఉంటారనేది టాక్ . గతంలో ఇదే విషయమై ఇద్దరు ఆటగాళ్ల ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగాయి. తాజాగా ట్విటర్ వేదికగా ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల మధ్య నిప్పు రాజేసింది. (చదవండి : పుజారా గోడ.. ద్రవిడ్ కంటే బలమైనదట!) 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులు ఒకరినొకరు ఎందుకంతలా ద్వేషిస్తారు? ఆ ఇద్దరూ టీమిండియా ఆటగాళ్లే కదా కదా. ఈ ప్రశ్న నన్ను ఎప్పటినుంచో వేధిస్తుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటూ' క్లోయీ అమందా బెయిలీ ట్వీట్ చేసింది. దీనికి యే గునా హై (ఇది నేరం) అంటూ నసీరుద్దీన్ షా చెప్పిన డైలాగ్‌తో పాటు అతని ఫోటోని పెట్టి షేర్ చేసింది. (చదవండి : పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు) దీంతో రోహిత్, కోహ్లి అభిమానులు ట్విటర్ వేదికగా గొడవకు దిగారు. 'రోహిత్ అంటే కోహ్లికి ద్వేషం అని'.. 'రోహిత్‌ను కోహ్లి చాలా సార్లు మెచ్చుకున్నాడు కానీ.. రోహిత్ ఎప్పుడూ కోహ్లిని మెచ్చుకోలేదని'... 'కోహ్లి ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదని అందుకే అతన్ని చూసి రోహిత్ నవ్వుకుంటాడని' కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆడుతున్న కోహ్లి ఈ మ్యాచ్ అనంతరం పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి రానున్నాడు. ఐపీఎల్ అనంతరం స్వదేశానికి వచ్చిన రోహిత్ శర్మపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే ఎన్సీఏ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనున్నాడు. కాగా కోహ్లి స్థానంలో మిగిలిన టెస్టులకు అజింక్యా రహానే నాయకత్వం వహించనున్నాడు. Why do Virat Kohli and Rohit Sharma fans dislike each other so much? They are both India? I need an explanation please. 🇦🇺🇮🇳 #AUSvIND pic.twitter.com/pKheSduMZZ — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) December 16, 2020 -
హాలీవుడ్ హీరో ఎఫ్బీ పేజీలో టాలీవుడ్ ఫ్యాన్స్ రచ్చ
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా సినీ నటుల అభిమానుల మధ్య వాగ్వాదం జరగడం సహజమే. కానీ ఇందుకు హాలీవుడ్ హీరో ఎఫ్బీ పేజీ వేదిక కావడమే ఇక్కడ విచిత్రం. తాజాగా హాలీవుడ్ హీరో అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఓ ఫొటోను తన ఎఫ్బీ అకౌంట్లో షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు టాలీవుడ్ హీరో మహేశ్ బాబు అభిమాని ఒకరు టామ్ క్రూజ్ కన్నా మహేశ్ బాబు అందగాడని, ఏ విషయంలోనైనా ఎక్కువేనని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం స్పందించడంతో రచ్చ మొదలైంది. మహేశ్ బాబు డ్యాన్స్‌పై వారు కామెంట్ చేయగా ఆయన అభిమానులు ఘాటుగా స్పందించారు. డ్యాన్స్ గురించి మాట్లాడటం కాదు కానీ మహేశ్ బాబు కేవలం 23 సినిమాలు చేసి 8 నంది అవార్డులు, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 21 టీఎస్ఆర్, 23 సంజయ్ దత్త్ అవార్డులు గెలుచుకున్నాడని బదులిస్తున్నారు. దీంతో ఈ వాగ్వాదం సోషల్ మీడియా వేదికగా తారా స్థాయికి చేరింది. ఇప్పుడి ఈ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. -
ఫ్లెక్సీల రగడ : భీమవరం టూ ఏలూరు
ఏలూరు సెంట్రల్ (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినీ హీరోలు పవన్‌కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన ఫ్లెక్సీల రగడ సమసిపోకముందే శనివారం ఏలూరులో బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అభిమానుల మధ్య ఫ్లెక్సీల ధ్వంసం కలకలం రేపింది. పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు నాలుగు రోజుల క్రితం ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ గేటు ఎదురుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శుక్రవారం రాత్రి ఈ ఫ్లెక్సీ పక్కనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా శనివారం ఉదయానికి పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ పూర్తిగా చించివేసి ఉండగా, పక్కనే ఉన్న బాలకృష్ణ ఫ్లెక్సీ స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో విషయం తెలుసుకున్న అభిమాన సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయా హీరోలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఇరు హీరోల అభిమాన సంఘాలతో మాట్లాడి ఎటువంటి గొడవల జోలికి పోవద్దని సూచించారు. ముందుజాగ్రత్తగా కాలేజీ వద్ద త్రీటౌన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా మూడురోజుల క్రితం భీమవరంలో పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ ధ్వంసం నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రభాస్ సామాజికవర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడులు చేయడం వంటి వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ భీమవరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.