వైరల్‌ : గొడవపడిన కోహ్లి, రోహిత్‌ ఫ్యాన్స్ | Fight Between Virat Kohli And Rohit Sharma Fans In Twitter | Sakshi
Sakshi News home page

వైరల్‌ : గొడవపడిన కోహ్లి, రోహిత్‌ ఫ్యాన్స్

Published Thu, Dec 17 2020 2:45 PM | Last Updated on Thu, Dec 17 2020 4:36 PM

Fight Between Virat Kohli And Rohit Sharma Fans In Twitter - Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మలు ఇద్దరు ఇద్దరే. బ్యాటింగ్‌ పరంగా  రికార్డుల సృష్టించడంలో ఎవరికి వారే సాటి. మైదానంలో కలిసి ఉన్నట్లే అనిపించినా బయట మాత్రం ఇద్దరు దూరంగా ఉంటారనేది టాక్‌ . గతంలో ఇదే విషయమై ఇద్దరు ఆటగాళ్ల ఫ్యాన్స్‌ మధ్య గొడవలు కూడా జరిగాయి. తాజాగా ట్విటర్‌ వేదికగా ఒక ఆస్ట్రేలియన్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్న ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల మధ్య  నిప్పు రాజేసింది. (చదవండి : పుజారా గోడ.. ద్రవిడ్‌ కంటే బలమైనదట!)

'రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి అభిమానులు ఒక‌రినొక‌రు ఎందుకంత‌లా ద్వేషిస్తారు? ఆ ఇద్ద‌రూ టీమిండియా ఆటగాళ్లే కదా క‌దా. ఈ ప్రశ్న నన్ను ఎప్పటినుంచో వేధిస్తుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నకు స‌మాధానం కావాలంటూ' క్లోయీ అమందా బెయిలీ ట్వీట్ చేసింది. దీనికి యే గునా హై (ఇది నేరం) అంటూ న‌సీరుద్దీన్ షా చెప్పిన డైలాగ్‌తో పాటు అతని ఫోటోని పెట్టి షేర్‌ చేసింది. (చదవండి : పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు)

దీంతో రోహిత్‌, కోహ్లి అభిమానులు ట్విటర్‌ వేదికగా గొడవకు దిగారు. 'రోహిత్‌ అంటే కోహ్లికి ద్వేషం అని'.. 'రోహిత్‌ను కోహ్లి చాలా సార్లు మెచ్చుకున్నాడు కానీ.. రోహిత్ ఎప్పుడూ కోహ్లిని మెచ్చుకోలేద‌ని'... 'కోహ్లి ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదని అందుకే అత‌న్ని చూసి రోహిత్ నవ్వుకుంటాడ‌ని' కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆడుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌ అనంతరం పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి రానున్నాడు. ఐపీఎల్‌ అనంతరం స్వదేశానికి వచ్చిన రోహిత్‌ శర్మపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే ఎన్‌సీఏ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్‌ ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనున్నాడు. కాగా కోహ్లి స్థానంలో మిగిలిన టెస్టులకు అజింక్యా రహానే నాయకత్వం వహించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement