
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే
అదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్‌ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.
ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.
కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.
అయితే, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్‌లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్‌లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్‌తో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది.
సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవే
భారత్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా
కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.
చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment