
ఐపీఎల్ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డన్‌లు ఇవాళ జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమను నిర్లక్ష్యం చేశాయని భావించిన ఈ ఇద్దరూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు.
ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో విధ్వంసకర శతకంతో (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ఆడుతున్న క్రిస్ జోర్డన్ 17 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో (20 బంతుల్లో 59; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. సాల్ట్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది వరుసగా రెండో శతకం కాగా.. జోర్డన్, తాను బౌలర్‌ను అన్న విషయాన్ని మరిచిపోయి, బ్యాట్‌తో వీరవిహారం చేశాడు.
వేలం మరుసటి రోజే ఈ ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోవడంతో ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. వీరిద్దరి విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నాయి. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన సాల్ట్, జోర్డన్‌లను పట్టించుకోకపోవడం అన్ని ఫ్రాంచైజీలు చేసిన అతి పెద్ద తప్పిదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉంటే ఈ ఇద్దరినీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడించే ప్రయత్నం చేయాలని వారు ఫ్రాంచైజీలకు సూచిస్తున్నారు.
Madness from CJ 🤯pic.twitter.com/XLS7wMAsih
— CricTracker (@Cricketracker) December 20, 2023