Chris Jordan
-
T20 World Cup 2024: క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్.. సెమీస్‌లో ఇంగ్లండ్
బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–8’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (28 బంతుల్లో 29; 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. జోర్డాన్ 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జోర్డాన్ 5 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి అండర్సన్‌ను అవుట్ చేసిన జోర్డాన్... మూడో బంతికి అలీఖాన్‌ను, నాలుగో బంతికి కెనిజిగెను, ఐదో బంతికి నేత్రావల్కర్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ మెరుపులు 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) మెరిపించారు. అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్ వేసిన తొమ్మిదో ఓవర్లో బట్లర్ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంది. నేడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్–2 నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
BBL 2023: రాణించిన క్రిస్ జోర్డన్, బెన్ మెక్‌డెర్మాట్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌పై హరికేన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. క్రిస్ గ్రీన్ (33 నాటౌట్), డేనియల్ సామ్స్ (25), బాన్‌క్రాఫ్ట్ (21), ఒలివర్ డేవిస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హరికేన్స్ బౌలర్లు క్రిస్ జోర్డన్ (2/20), నిఖిల్ చౌదరీ (2/26), పాట్రిక్ డూలీ (2/33), నాథన్ ఇల్లిస్ (1/39) థండర్ పతనాన్ని శాశించారు. అనంతరం ఛేదనకు దిగిన హరికేన్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (53 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాలెబ్ జువెల్ (31), రైట్ (34) రాణించగా.. ఆఖర్లో ఆండర్సన్ (12 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. థండర్ బౌలర్లలో డేనియల్ సామ్స్, తన్వీర్ సంగా, నాథన్ మెక్‌అండ్రూ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో హరికేన్స్ రన్‌రేట్‌ను కాస్త మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన థండర్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. -
ఐపీఎల్ వేలం ఎఫెక్ట్.. బౌలర్‌ను విధ్వంసకర బ్యాటర్లా మార్చేసింది..!
ఐపీఎల్ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డన్లు ఇవాళ జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమను నిర్లక్ష్యం చేశాయని భావించిన ఈ ఇద్దరూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో విధ్వంసకర శతకంతో (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ఆడుతున్న క్రిస్ జోర్డన్ 17 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో (20 బంతుల్లో 59; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. సాల్ట్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది వరుసగా రెండో శతకం కాగా.. జోర్డన్, తాను బౌలర్‌ను అన్న విషయాన్ని మరిచిపోయి, బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. వేలం మరుసటి రోజే ఈ ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోవడంతో ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. వీరిద్దరి విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నాయి. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన సాల్ట్, జోర్డన్లను పట్టించుకోకపోవడం అన్ని ఫ్రాంచైజీలు చేసిన అతి పెద్ద తప్పిదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉంటే ఈ ఇద్దరినీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడించే ప్రయత్నం చేయాలని వారు ఫ్రాంచైజీలకు సూచిస్తున్నారు. Madness from CJ 🤯pic.twitter.com/XLS7wMAsih— CricTracker (@Cricketracker) December 20, 2023 -
ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అప్‌కమింగ్ పేస్ గన్ జోష్ టంగ్ గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ సెలెక్టర్లు టంగ్ స్థానాన్ని వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్‌తో భర్తీ చేశారు. కాగా, యాషెస్-2023 సిరీస్‌కు ముందు జరిగిన ఐర్లాండ్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల టంగ్.. ఐర్లాండ్ మ్యాచ్‌తో పాటు యాషెస్ సిరీస్‌లోని లార్డ్స్ టెస్ట్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టంగ్ 25.7 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5 వికెట్ల ఘనత కూడా ఉంది. ఇదిలా ఉంటే, 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈనెల (ఆగస్ట్) 30న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లలో తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్, ల్యూక్ వుడ్ -
ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల సునామీ
క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనూ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేసి ఎరుగని ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్.. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం సృష్టించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది ప్రత్యర్ధి బౌలర్లను గడగడలాడించాడు. జోర్డన్ సిక్సర్ల సునామీలో సౌతాంప్టన్ స్టేడియం తడిసి ముద్ద అయ్యింది. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న జోర్డన్ 7 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్ సాధించడానికి తోడ్పడ్డాడు. జోర్డన్ రాణించకపోతే అతను ప్రాతినిథ్యం వహిస్తున్న సదరన్ బ్రేవ్ నామమాత్రపు స్కోర్ కూడా చేయలేకపోయేది. జోర్డన్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో జోర్డన్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జోర్డన్‌తో పాటు ఫిన్ అలెన్ (21), కెప్టెన్ జేమ్స్ విన్స్ (18), డు ప్లూయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రత్యర్ధి బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, డేవిడ్ విల్లే, డేవిడ్ పెయిన్, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. Chris Jordan, take a bow 👊 A performance of 70 runs from just 32 balls, including 7 sixes 😲#TheHundred pic.twitter.com/Z2nqWBzaJF — The Hundred (@thehundred) August 4, 2023 అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో లూక్ వెల్స్ (24), స్టీఫెన్ ఎస్కీనాజీ (31), గ్లెన్ ఫిలిప్ (22), డేవిడ్ విల్లే (31) రాణించగా.. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్ (2/41), టైమాల్ మిల్స్ (2/23), రెహాన్ అహ్మద్ (2/28) సత్తా చాటారు. ఈ గెలుపుతో బ్రేవ్ ప్రస్తుత ఎడిషన్‌లో బోణీ కొట్టింది. -
ఇదేమి చెత్త బౌలింగ్రా బాబు.. 12 ఓవర్లలో 132 రన్స్! ఇంతకుమించి ఎవరూ దొరకలేదా?
ఐపీఎల్-2023లో సెకెండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్, ముంబై ఇండియన్స్ పేసర్ క్రిస్ జోర్డాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ టోర్నీ మధ్యలోనే వైదొలడగడంతో.. ముంబై ఇండియన్స్ ఆ స్థానాన్ని జోర్డాన్‌తో భర్తీ చేసింది. అర్చర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జోర్డాన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 50 పరుగులిచ్చాడు. ముఖ్యంగా 18 ఓవర్ వేసిన జోర్డాన్‌కు లక్నో ఆల్‌రౌండర్ స్టోయినిష్ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 24 పరుగులు స్టోయినిష్ రాబట్టుకున్నాడు. దీంతో లక్నో 177 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌లు కలిపి 12 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఇంగ్లీష్ బౌలర్ .. ఏకంగా 132 పరుగులిచ్చాడు. ఇక చెత్త ప్రదర్శన కనబరుస్తున్న జోర్డాన్‌పై ముంబై ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదేమి చెత్త బౌలింగ్, ఇంతకమించి ఎవరూ దొరకలేదా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. చదవండి: IPL 2023: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
జోర్డాన్‌కు చుక్కలు.. ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్‌కు స్టోయినిస్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా క్రిస్ జోర్డాన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్ కరన్ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్ 9.26, శార్దూల్ ఠాకూర్ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 103* రెండో స్థానంలో ఉన్నాడు. Stoinis stepping up when #EveryGameMatters!💪 Can @MStoinis carry on to lead his team to a formidable total?#TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/d1q6aBWHSJ — JioCinema (@JioCinema) May 16, 2023 చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్' -
ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు. ఇక అర్చర్ స్థానాన్ని ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. రూ.2 కోట్ల కనీస ధరకు జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. "దురదృష్టవశాత్తూ మిగిలిన మ్యాచ్‌లకు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి స్థానాన్ని క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు" అని ముంబై ఇండియన్స్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఈ ఏడాది సీజన్లో జోఫ్రా అర్చర్ అంతగా అకట్టుకోలేకపోయాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 9.50 ఏకానమితో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 స్పెషలిస్టు బౌలర్‌గా పేరుందిన క్రిస్ జోర్డన్ జట్టులో చేరడం ముంబైకు మరింత బలం చేకూరుస్తుంది. ఇంగ్లండ్ తరపున 87 టీ20లు ఆడిన జోర్డాన్ 96 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌కు జోర్డాన్ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్ -
ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఎవరంటే?
ఐపీఎల్-2023లో మిగిలిన మ్యాచ్‌లకు గాను ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా అధికారికంగాప్రకటించలేదు. కానీ జోర్డాన్ మాత్రం ముంబై ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తుండడం కన్పించింది. అయితే అతడిని ఎవరు స్థానంలో భర్తీ చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కావడంతో.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పుడు జట్టులో జోర్డాన్ చేరడం వాళ్లకు బలం చేకూరుతుంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం వాంఖడే వేదికగా తలపడనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: #HBD Rohit Sharma: రోహిత్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్ బర్త్‌డే గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్ -
ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరన్, డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, టైమల్ మిల్స్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్‌తో అలరించిన రిషి సునాక్ ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో సామ్ కరన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఇక టి20 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ తమ దేశం పొట్టి క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. -
ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ చర్య నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోర్డాన్ వేశాడు. ఆ ఓవర్లో జోర్డాన్ వేసిన నాలుగో బంతిని మహ్మద్ వసీమ్ కట్‌షాట్ ఆడగా నేరుగా హ్యారీబ్రూక్ చేతుల్లోకి వెళ్లింది. బ్రూక్ క్యాచ్ పట్టుంటే మాత్రం టోర్నీలో మరొక బెస్ట్ క్యాచ్ నమోదయ్యేది. కానీ ఆఖరి నిమిషంలో బ్రూక్ బంతిని కింద పెట్టేశాడు. అప్పటికే మహ్మద్ వసీమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బ్రూక్ బంతి విసరగా అందుకున్న జోర్డాన్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. అలా బంతి మరోసారి పరుగులు పెట్టింది. స్టోక్స్ త్రో వేయగా.. ఈసారి కూడా జోర్డాన్ వికెట్లకు బంతిని వేయడంలో విఫలమయ్యాడు. అలా జోర్డాన్ చేసిన పనికి పాక్‌కు మూడు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/rQ5PRkMLg7 — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
WC 2022 Final: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మెల్బోర్న్ మ్యాచ్‌లో ఆది నుంచే తమ ప్రణాళికను అమలు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఐదో ఓవర్ రెండో బంతికి పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ శుభారంభం అందించాడు. తర్వాత ఆదిల్ రషీద్ మహ్మద్ హారీస్(8), బాబర్ ఆజం(32)ను పెవిలియన్‌కు పంపగా.. స్టోక్స్ ఇఫ్తీకర్ అహ్మద్(0) పని పట్టాడు. ఇక జోరు కనబరిచిన షాన్ మసూద్(28 బంతుల్లో 38 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకోగా..క్రిస్ జోర్డాన్ షాదాబ్ ఖాన్(20)ను ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత సామ్ మరోసారి తన మ్యాజిక్‌తో మహ్మద్ నవాజ్(5) వికెట్ తీయగా.. ఆఖరి ఓవరల్లో మహ్మద్ వసీం జూనియర్(4)ను అవుట్ చేసి జోర్డాన్ పాక్ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు ఇంగ్లీష్ బౌలర్లు. 16- 20 ఓవర్ల మధ్యలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు కూల్చారు. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. పాక్‌తో ఫైనల్లో 16-20 ఓవర్లలో 16.2: సామ్ కరన్- షాన్ మసూద్ వికెట్ 17.2: క్రిస్ జోర్డాన్- షాదాబ్ ఖాన్ వికెట్ 18.3: సామ్ కరన్- మహ్మద్ నవాజ్ వికెట్ 19.3: క్రిస్ జోర్డాన్- మహ్మద్ వసీం జూనియర్ వికెట్ ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ డెత్ ఓవర్లలో బౌలింగ్ సాగిందిలా.. 23/6 అఫ్గనిస్తాన్, పెర్త్ 30/7 ఐర్లాండ్, మెల్బోర్న్ 36/3 న్యూజిలాండ్ , బ్రిస్బేన్ 25/5 శ్రీలంక, సిడ్నీ రెండో సెమీ ఫైనల్- 68/3 ఇండియా, అడిలైడ్ ఫైనల్- 31/4 పాకిస్తాన్, మెల్బోర్న్ చదవండి: T20 WC 2022: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా -
T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ మెగా టోర్నీలో భాగం కానున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను శుక్రవారం వెల్లడించింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆరోజే తొలి మ్యాచ్ ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న పేస్ ద్వయం క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్ సైతం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022: ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన జట్టు ఇదే! జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: IPL Auction: షాహిన్ ఆఫ్రిది ఐపీఎల్ వేలంలోకి వస్తే 14- 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు: అశ్విన్ Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. పవర్ హిట్టర్ ఎంట్రీ! Squad 🙌 #T20WorldCup 🏏 🌏 🏆 pic.twitter.com/k539Gzd5Ka — England Cricket (@englandcricket) September 2, 2022 -
సీఎస్కే బౌలర్‌కు చుక్కలు చూపించిన రషీద్ ఖాన్..
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 18 వ ఓవర్లో రషీద్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఖాన్ జోర్డాన్ వేసిన ఓవర్లో తొలి నాలుగు బంతులను 6,6,4,6గా మలిచి 22 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బ్రావో వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో బౌండరీ బాదిన రషీద్ ఖాన్.. అదే ఓవర్ ఐదో బంతికి మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా 21 బంతుల్లో 40 పరుగుల రషీద్ విధ్వంసానికి తెరపడింది. కాగా సీఎస్కేతో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండడంతో.. రషీద్ ఖాన్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రషీద్ ఖాన్ విధ్వంసం కోసం క్లిక్ చేయండి -
సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చి, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో పిడుగులాంటి వార్త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా లీగ్‌కు దూరం కాగా (ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది), తాజాగా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ టాన్సిల్స్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. గత కొంతకాలంగా టాన్సిల్స్‌తో బాధపడుతన్న జోర్డాన్‌కు ఇన్ఫెక్షన్ అధికం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. మరోవైపు మరో విదేశీ పేసర్ ఆడమ్ మిల్నే పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు గాయం బారిన పడ్డాడు. అతని తగిలిన గాయం కూడా తీవ్రమైందేనని సమాచారం. సీఎస్కే ఆదివారం (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. గాయాలబారిన పడి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటం ఆ జట్టును కలవరపెడుతుంది. ప్రస్తుతం సీఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిలో ఒక్క ప్రిటోరియస్ తప్ప మిగిలిన వారంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్నోతో మ్యాచ్‌లో శివమ్ దూబే వేసిన ఒక్క ఓవర్ సీఎస్కే నుంచి విజయాన్ని లాగేసుకుంది. లక్నోతో మ్యాచ్‌లో సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చదవండి: IPL 2022: 10000 పరుగుల క్లబ్లో చేరనున్న రోహిత్ శర్మ.. -
మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది
Chris Jordan Spectacular Fielding Denies Six.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ అద్భుతాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టుకు సిక్స్ లభించింది. విషయంలోకి వెళితే..ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతిని డారిల్ మిచెల్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే లాంగాఫ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో దాదాపు బంతిని అందుకున్నట్లుగానే కనిపించాడు. కానీ పట్టుతప్పిన జోర్డాన్ బౌండరీలైన్ అవతల పడ్డాడు. దీంతో న్యూజిలాండ్‌కు సిక్స్ వచ్చింది. కాగా న్యూజిలాండ్ ఓపెనర్ డారిల్ మిచెల్ అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో చేసిన ఫీట్ అందరికి గుర్తుండే ఉంటుంది. దాదాపు ఇదే తరహాలో మిచెల్ గాల్లోకి ఎగురుతూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే పట్టుతప్పి బౌండరీ లైన్‌మీద పడే అవకాశం ఉండడంతో అతను కిందపడేలోపే బంతిని బౌండరీ ఇవతలకు విసిరాడు. అలా జట్టుకు నాలుగు పరుగులు కాపాడాడు. ప్రస్తుతం క్రిస్ జోర్డాన్ ఫీల్డింగ్ మూమెంట్ వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది. అంటూ కామెంట్ చేశారు. -
వావ్.. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
అహ్మదాబాద్: భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ అవుటైన తీరు హైలైట్‌గా నిలిచింది. బౌండరీ వద్ద జోర్డాన్ అద్భుత ప్రదర్శన అందుకు కారణం. రషీద్ బౌలింగ్‌లో సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని రాయ్వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. బంతిని అందుకున్న సమయంలో రాయ్ నవ్విన తీరు ఈ క్యాచ్ ఎంత అసాధారణమో చూపించింది. Chris Jordan Pulling Off A Michael Jordan Lay-Up!#IndiavsEngland #INDvsENG pic.twitter.com/FrAtVCPhBf — @TimeTravellerJofraArcher (@JofraArcher8) March 20, 2021 కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. చదవండి: (ఆఖరి పోరులో అదరగొట్టారు) -
ఫీల్డ్ అంపైర్ల బుద్ధి మందగించిందా?
దుబాయ్: కరోనా దెబ్బతో ఇళ్లకే పరిమితమై ఎంటర్టైన్మెంట్కు మొహం వాచిపోయిన జనాలను ఖుషీ చేయడానికి క్యాష్ రిచ్ క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ప్రారంభమైంది. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్ మామూలుగా సాగిపోయినా, ఢిల్లీ-పంజాబ్ మధ్య ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ మాత్రం అసలైన మజా అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. మయాంక్ అగర్వాల్ పోరాట పటిమతో పంజాబ్ గెలుపు దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా అగర్వాల్ ఔటవడంతో... మ్యాచ్ టైగా ముగిసింది. చివరి వరకూ లక్ష్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. అయితే, అంపైర్ల తప్పుడు నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని పంజాబ్ అభిమానులు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. టెక్నాలజీ జోక్యం ఎక్కువ కావడంతో అంపైర్ల బుద్ధి మందగించిందని చురకలు వేస్తున్నారు. పంజాబ్ యజమాని ప్రీతి జింటా కూడా అంపైర్లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. విషమేంటంటే.. 157 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ గెలుపు దిశగా సాగుతోంది. బ్యాట్‌తో మెరిసిన ఢిల్లీ ఆటగాడు స్టొయినిస్ ఇన్నింగ్స్ 19 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న మయాంక్ షాట్ కొట్టడంతో రెండు పరుగులొచ్చాయి. అయితే, ఓవర్ పూర్తవగానే.. పంజాబ్ ఇన్నింగ్స్‌కు అంపైర్లు ఒక పరుగు కోత విధించారు. (చదవండి: పంజాబ్ సూపర్ ఫ్లాప్...) నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ తొలి పరుగు తీసే క్రమంలో షార్ట్ రన్ చేశాడంటూ చెప్పారు. దాంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఒక్కసారిగా ఉత్కంఠ. ఇక చివరి బంతికి జోర్డాన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్‌లో ఓవర్లో పంజాబ్ రెండు పరుగులే చేయడంతో ఢిల్లీ మూడు పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. టీవీ రీప్లేలో మాత్రం జోర్డాన్ పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. (చదవండి: ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది) Standard of umpiring is once again under the criticism. Why not @bcci takes a cognizance into it?? Technology fucked the umpire's attention literally 😬 #IPL2020 #DCvKXIP pic.twitter.com/B9dz3GMUf3 — Pradhumn- CSKian 💛 (@pradhumn_pratap) September 21, 2020 -
పంజాబ్ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు
హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా పెర్త్ స్కాచర్స్ తరుపున ఆడుతున్న ఈ పేసర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్టియాన్ లాంగాన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘పంజాబ్ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్ ఈసారి పంజాబ్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని నయా పంజాబ్ జట్టు వచ్చే సీజన్లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq — ICC (@ICC) December 21, 2019 -
టీ20 చరిత్రలో ఇంత ఘోర ఓటమా!
సెయింట్ లూసియా : దనాదన్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై ఘోర ఓటమి చవిచూసింది. అసలు ఆడింది డిఫెండింగ్ చాంపియన్ విండీస్ జట్టేనా అని అనుమానం కలిగించేలా ఇంగ్లండ్‌పై అతి చెత్తగా ఆడారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరీబియన్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో 137 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసి ఇంగ్లండ్‌కు టీ20 సిరీస్‌ను అప్పగించింది. టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో పసికూన నెదర్లాండ్‌ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే టెస్టు జట్టు హోదాలేని నెదర్లాండ్ చేసిన చెత్త ప్రదర్శన కన్నా టీ20 డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తాజా ప్రదర్శనే అతి ఘోరమైనదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు శుభారంభం అందలేదు. అయితే జోయ్ రూట్(55) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో బిల్లింగ్స్ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్కర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఘోరంగా తడబడింది. క్రిస్ జోర్డాన్(4/6), విల్లే(2/18), రషీద్(2/12), ప్లంకెట్(2/8)లు కరేబియన్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి హెట్మేర్(10), బ్రాత్‌వైట్(10)లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 11.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటై విండీస్ ఘోర ఓటమి చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొటి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
మెరుపు వేగంతో రనౌట్ చేసిన ధోని
-
ధోని బుర్రకు హ్యాట్సాఫ్!
బ్రిస్టల్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వికెట్ కీపర్లలో ధోనితో సరితూగ గలవారు ఎవరూ లేరనే దానికి అతను సాధిస్తున్న రికార్డులే అద్దం పడుతున్నాయి. అలాంటి ధోనిని బోల్తా కొట్టిస్తూ ఆఖరి బంతికి పరుగు తీయాలని ఆశించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోర్డాన్‌కి నిరాశే ఎదురైంది. అతను క్రీజులోకి వచ్చేలోపే.. బెయిల్స్ అతనికి స్వాగతం పలికాయి. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పిన ధోని.. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ని యువ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ వేశాడు. ఆ ఓవర్లోని ఐదు బంతులు ముగిసేసరికి.. ఇంగ్లండ్ 198/8తో నిలిచింది. దీంతో.. చివరి బంతికి ఎలాగైనా ఒక పరుగు తీసి.. భారత్ ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచాలని క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్, జోర్డాన్ నిర్ణయించుకున్నారు. దీంతో.. షార్ట్‌పిచ్ రూపంలో బంతిని విసరాల్సిందిగా.. సిద్ధార్థ్ కౌల్‌కి ధోని సూచించాడు. ఈ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్.. ఒకవేళ బంతి బ్యాట్‌కి తగలకపోయినా.. పరుగు తీయాలని సైగల ద్వారా ఆదిల్ రషీద్‌కి తెలియజేశాడు. దీన్ని పసిగట్టిన ధోనీ.. ముందుగానే తన కుడిచేతి గ్లౌవ్‌ని తీసేసి రనౌట్‌కి సిద్ధమైపోయాడు. వ్యూహం ప్రకారం సిద్ధార్థ్ కౌల్ షార్ట్‌పిచ్ బంతిని విసరగా.. దాన్ని ఆదిల్ రషీద్ కనీసం టచ్ కూడా చేయలేకయాడు. అదే సమయంలో పరుగు కోసం జోర్డాన్ ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. దాంతో ధోని బ్రెయిన్‌కు హ్యాట్సాఫ్ అంటూ క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మా పని అయిపోలేదు.. బంతిలా పైకిలేస్తాం: క్రికెటర్
ప్రస్తుత ఐపీఎల్ సిరీస్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) జట్టు అట్టడుగున మగ్గుతోంది. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ఆ జట్టుకు సెమిస్ అవకాశాలు దాదాపు లేనట్టే. కానీ ఆర్సీబీలోకి తాజాగా చేరిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ మాత్రం ఇంకా తమకు పూర్తిగా ద్వారాలు మూసుకుపోలేదని, ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ను తాము కచ్చితంగా గెలువాల్సి ఉందని చెప్తున్నాడు. 'ఇప్పటినుంచి మేం ప్రతి మ్యాచ్ ను కచ్చితంగా గెలువాలి. ఎక్కువగా ఆలోచించడం లేదు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ పైనే మేం ప్రధానంగా ఫోకస్ పెట్టాం' అని జోర్డన్ చెప్పాడు. ఆర్సీబీ ప్రదర్శన ఇప్పటివరకు అనుకున్నరీతిలో లేనప్పటికీ, ఇప్పటికీ ఐపీఎల్ లో తమ జట్టు పుంజుకునే అవకాశముందని, నేలకు కొట్టిన బంతిలా పైకిలేవడంపైనే తాము ఫోకస్ పెట్టామని జోర్డన్ తెలిపాడు. 'మేం గతాన్ని వదిలేసి.. తదుపరి మ్యాచ్ లో మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాం. పుణెను మేం తప్పకుండా ఓడిస్తాం. ఈ విజయాన్ని కనుక సాధిస్తే.. ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది' అని అన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఐదింటిలో ఓడిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ తమ జట్టు చాలా దృఢంగా ఉందని, జట్టులో ఎంతోమంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉన్నారని, వారితో కలిసి ఆడేందుకు తాను ఎదురుచూస్తున్నానని జోర్డన్ చెప్పుకొచ్చాడు.