Netizens brutally roasts Chris Jordan after a poor show against LSG - Sakshi
Sakshi News home page

IPL 2023: ఇదేమి చెత్త బౌలింగ్‌రా బాబు.. 12 ఓవర్లలో 132 రన్స్‌! ఇంతకుమించి ఎవరూ దొరకలేదా?

Published Wed, May 17 2023 12:02 PM | Last Updated on Wed, May 17 2023 12:58 PM

brutally roasts Chris Jordan after a poor show against LSG - Sakshi

ఐపీఎల్‌-2023లో సెకెండ్‌ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరో ఇంగ్లండ్‌ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ టోర్నీ మధ్యలోనే వైదొలడగడంతో.. ముంబై ఇండియన్స్‌ ఆ స్థానాన్ని జోర్డాన్‌తో భర్తీ చేసింది. అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జోర్డాన్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్‌ ఏమీ తీయకుండా 50 పరుగులిచ్చాడు. ముఖ్యంగా 18 ఓవర్‌ వేసిన జోర్డాన్‌కు లక్నో ఆల్‌రౌండర్‌ స్టోయినిష్‌ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు స్టోయినిష్‌ రాబట్టుకున్నాడు.

దీంతో లక్నో 177 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌లు కలిపి 12 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ ఇంగ్లీష్ బౌలర్‌ .. ఏకంగా 132 పరుగులిచ్చాడు. ఇక చెత్త ప్రదర్శన కనబరుస్తున్న జోర్డాన్‌పై ముంబై ఫ్యాన్స్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదేమి చెత్త బౌలింగ్‌, ఇంతకమించి ఎవరూ దొరకలేదా? అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement