డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో పిడుగులాంటి వార్త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా లీగ్‌కు దూరం కాగా (ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది), తాజాగా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ టాన్సిల్స్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు.
గత కొంతకాలంగా టాన్సిల్స్‌తో బాధపడుతన్న జోర్డాన్‌కు ఇన్‌ఫెక్షన్ అధికం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. మరోవైపు మరో విదేశీ పేసర్ ఆడమ్ మిల్నే పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు గాయం బారిన పడ్డాడు. అతని తగిలిన గాయం కూడా తీవ్రమైందేనని సమాచారం. సీఎస్‌కే ఆదివారం (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. గాయాలబారిన పడి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటం ఆ జట్టును కలవరపెడుతుంది.
ప్రస్తుతం సీఎస్‌కే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిలో ఒక్క ప్రిటోరియస్ తప్ప మిగిలిన వారంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్నోతో మ్యాచ్‌లో శివమ్ దూబే వేసిన ఒక్క ఓవర్ సీఎస్‌కే నుంచి విజయాన్ని లాగేసుకుంది. లక్నోతో మ్యాచ్‌లో సీఎస్‌కే 210 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.
చదవండి: IPL 2022: 10000 పరుగుల క్లబ్‌లో చేరనున్న రోహిత్ శర్మ..
Comments
Please login to add a commentAdd a comment