IPL 2022: Matheesha Pathirana Hilarious 175 Kmph Ball in 2020 After He Joins CSK - Sakshi
Sakshi News home page

Matheesha Pathirana: ఈ చెన్నై కొత్త బౌలర్‌ స్పీడ్‌లో షోయబ్‌ అక్తర్‌కి బాబు.. 175 కిమీ రాకెట్‌ వేగంతో..!

Published Thu, Apr 21 2022 6:58 PM | Last Updated on Thu, Apr 21 2022 7:18 PM

IPL 2022: CSK New Entry Matheesha Pathirana Bowled 175 kph Ball In 2020 - Sakshi

ఆడమ్‌ మిల్నే స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో చేరిన శ్రీలంక యువ పేసర్‌ మతీష పతిరన గురించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విలక్షణ బౌలింగ్‌ శైలితో జూనియర్‌ మలింగగా గుర్తింపు పొందిన పతిరన 2020 అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో 175 కిలోమీటర్ల రాకెట్‌ వేగంతో బంతిని విసిరి రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరన నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. 


నాటి యువ భారత జట్టు సభ్యుడు, ప్రస్తుత రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు వేసిన ఓ బంతి స్పీడోమీటర్‌ (వేగాన్ని కొలిచే యంత్రం) సామర్థ్యానికి మించిన రికార్డు వేగాన్ని (175 కిమీ) నమోదు చేసింది. అయితే ఆ బంతి వైడ్ కావడంతో వికెట్లు బతికిపోయాయి. పతిరన ఫాస్టెస్ట్‌ డెలివరికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ వీడియోని ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 


అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డెలివరి రికార్డు (161 కిమీ) పాక్‌ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిట ఉండగా.. తమ కొత్త పేసర్‌ స్పీడ్‌లో అక్తర్‌కు బాబు అంటూ చెన్నై అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ రికార్డు వేగంతో బంతులు వేస్తున్నాడు. ఉమ్రాన్‌ గత కొన్ని మ్యాచ్‌లుగా క్రమంగా 150కు మించిన స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తూ స్విగ్గి ఇస్తున్న ఫాస్టెస్ట్ డెలివరీ  అవార్డును దాదాపు ప్రతి మ్యాచ్‌లో గెలుచుకుంటున్నాడు. 

ఇదిలా ఉంటే, చెన్నై జట్టు మతీషతో రూ. 20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. 19 ఏళ్ల మతీష.. 2020, 2022 అండర్ 19 వరల్డ్ కప్‌లలో లంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దిగ్గజ పేసర్‌ మలింగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో బౌలింగ్‌ చేసే మతీష.. శ్రీలంక తరఫున రెండు టీ20లు ఆడాడు. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇవాళ (ఏప్రిల్‌ 21) ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. 


చదవండి: చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి జూనియర్‌ మలింగ.. మిల్నే స్థానంలో ఎంట్రీ


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement