
Breadcrumb
IPL 2022: చెన్నైపై 5 వికెట్ల తేడాతో ముంబై విజయం
Published Thu, May 12 2022 6:58 PM | Last Updated on Thu, May 12 2022 10:55 PM

Live Updates
IPL 2022: సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
చెన్నైను చిత్తు చేసిన ముంబై.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు, సమర్జీత్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లతో సీఎస్కేను దెబ్బతీయగా.. మెరిడిత్ రెండు, బుమ్రా, కార్తీకేయ, రమణ్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ధోని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
12 ఓవర్లకు మంబై స్కోర్: 80/4
12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 48 బంతుల్లో 18 పరుగులు కావాలి.
34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై
98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో సామ్స్, స్టుబ్స్ పెవిలియన్‌కు చేరారు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 36/4
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్.. సమర్జీత్ సింగ్ బౌలింగ్‌లో ధోనికు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
3 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 21/1
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(14), సామ్స్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..
98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కిషన్.. చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లతో సీఎస్కేను దెబ్బతీయగా.. మెరిడిత్ రెండు, బుమ్రా, కార్తీకేయ, రమణ్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ధోని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. 80/8
డ్వైనో బ్రావో(12), సిమిర్జీత్ సింగ్(2).. కుమార్ కార్తీకేయ వేసిన ఒకే ఓవర్లో అవుటయ్యారు.
39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు, మెరిడిత్ రెండు, బుమ్రా ఒక్క వికెట్ పడగొట్టారు. క్రీజులో ధోని, బ్రావో ఉన్నారు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 45/6
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే
29 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రాయుడు.. మెరిడిత్ బౌలింగ్‌లో కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే
17 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన గైక్వాడ్.. సామ్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే
5 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(2), రాయుడు ఉన్నారు.
తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే, మోయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్-2022లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంస్ ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణదీప్ సింగ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
Related News By Category
Related News By Tags
-
IPL 2024: 150 కొట్టిన సీఎస్కే.. ఇంకో రెండేస్తే ప్రపంచ రికార్డు
పొట్టి క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్లో సీఎస్కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో విజ...
-
IPL 2024 MI VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతు...
-
ఓటమి పాలైనప్పటికి ఎంఎస్ ధోని అరుదైన ఫీట్
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర ప్రదర్శన చేసింది. సీఎస్కే బ్యాటర్లంతా కట్టగట్టుకొని విఫలం కావడంతో ముంబైపై నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 16 ఓవర్లలో 97 పరుగులకు...
-
తెలుగుతేజంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రశంసల వర్షం
తెలుగుతేజం తిలక్ వర్మ ఐపీఎల్ 2022 సీజన్లో మరోసారి మెరిశాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్య చేధనలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది.ఘీ దశలో తిలక్ వర్మ 3...
-
ఫీల్డ్ అంపైర్‌ను డైలమాలో పడేసిన ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022 సీజన్లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్ శర్మ ...