Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర ప్రదర్శన చేసింది. సీఎస్కే బ్యాటర్లంతా కట్టగట్టుకొని విఫలం కావడంతో ముంబైపై నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 16 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. ధోని ఒక్కడే 33 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడినట్లు కనిపించింది. అయితే తిలక్ వర్మ 34*పరుగులు బాధ్యతగా ఆడి చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు.
ఇక మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైనప్పటికి కెప్టెన్ ధోని మాత్రం అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరపున ధోని ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలవడం 21వ సారి. సీఎస్‌కే తరపున ధోని మూడో ఆటగాడిగా ఉన్నాడు. ఇంతకముందు సురేశ్ రైనా 33 ఇన్నింగ్స్‌లు, ఫాఫ్ డుప్లెసిస 26 ఇన్నింగ్స్‌ల్లో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబైతో మ్యాచ్‌లో ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్ మే15న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
చదవండి: Umpire Confusion: ఫీల్డ్ అంపైర్‌ను డైలమాలో పడేసిన ధోని.. వీడియో వైరల్
Tilak Varma: తెలుగుతేజంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రశంసల వర్షం
Comments
Please login to add a commentAdd a comment