Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. శనివారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ డకౌట్ గాకా.. గత నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ వరుసగా 2,3,0,0 పరుగులు చేసి విఫలమయ్యాడు.
కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్ ఉందని అభిమానులు పేర్కొనడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ దీపక్ చహర్ వేశాడు. రోహిత్‌తో ధోని మైండ్‌గేమ్ ఆడాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాక్‌వర్డ్ పాయింట్, స్లిప్, థర్డ్‌మన్‌లో ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు.
ఆ తర్వాత చహర్ బంతి వేయడానికి ముందే ధోని స్టంప్స్ దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్ వేసేటప్పుడు వికెట్ కీపర్ వికెట్లకు కాస్త దూరంగా ఉంటాడు. కానీ ధోని మాత్రం బంతి వేయడానికి ముందే స్టంప్స్ దగ్గరకు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. కానీ ఊహించినట్లుగానే చహర్ స్లోబాల్ వేశాడు.
ఇక రోహిత్ ల్యాప్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లడం.. అక్కడే ఉన్న జడ్డూ సింపుల్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. ఇలా ధోని మైండ్‌గేమ్‌తో రోహిత్‌ను బుట్టలో వేసుకొని ఫలితం రాబట్టాడు. రోహిత్ ఔట్‌ను కామెంటేటర్‌లో ఎయిర్‌లో.. ధోని మాస్టర్‌మైండ్.. మంత్రం ఫలించింది అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
👉MSD comes up to the stumps 😎
— IndianPremierLeague (@IPL) May 6, 2023
👉Rohit Sharma attempts the lap shot
👉@imjadeja takes the catch 🙌
Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7
Comments
Please login to add a commentAdd a comment