రహానే మెరుపులు.. ముంబైపై సీఎస్‌కే ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.
అజింక్యా రహానే(27 బంతుల్లోనే 61 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఆ తర్వాత రుతురాజ్ గైకఆవడ్(40 నాటౌట్), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(20 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు. ముంబై బౌలర్లలో జాసన్ బెండార్ఫ్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయలు తలా ఒక వికెట్ తీశారు.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
28 పరుగులు చేసిన శివమ్ దూబే కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో సీఎస్‌కే 125 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు అజింక్యా రహానే(27 బంతుల్లోనే 61 పరుగులు) చావ్లా బౌలింగ్‌లో సుర్యకు క్యాచ్ ఇవ్వడంతో సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది.
రహానే మెరుపు అర్థసెంచరీ.. విజయం దిశగా సీఎస్‌కే
అజింక్యా రహానే 19 బంతుల్లోనే అర్థశతకం సాధించడంతో సీఎస్‌కే విజయం దిశగా సాగుతుంది. ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 68 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. రుతురాజ్ 8 పరుగులతో సహకరిస్తున్నాడు.
విజృంభిస్తోన్న రహానే.. సీఎస్‌కే 4 ఓవర్లలో 44/1
సీఎస్‌కే బ్యాటర్ అజింక్యా రహానే విజృంభిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బతో సీఎస్‌కే 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
సీఎస్‌కే టార్గెట్ 158
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో టిమ్ డేవిడ్ 31, ఇషాన్ కిషన్ 31 పరుగులు చేశారు. చివర్లో హృతిక్ షోకీన్ 13 బంతుల్లో మూడు సిక్సర్లతో 18 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండేలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మగలా ఒక వికెట్ తీశాడు.
Photo Credit : IPL Website
కష్టాల్లో ముంబై ఇండియన్స్.. 14 ఓవర్లలో 105/6
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై కష్టాల్లో పడింది. 14 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 11, ట్రిస్టన్ స్టబ్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు తిలక్‌వర్మ 22 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ (21), ఇషాన్ కిషన్(32) మంచి ఆరంభం ఇచ్చినప్పటికి తొందరగానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కామెరున్ గ్రీన్, సూర్యకుమార్‌లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
Photo Credit : IPL Website
రోహిత్ శర్మ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఓపెనర్ రోహిత్ శర్మ తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మాజీ ఛాంపియన్స్ మధ్య పోరు జరగనుంది. వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టాలని ముంబై టీమ్ పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో విజయం సాధించాలని ధోనీ సేన భావిస్తోంది.
The 🪙 lands in favour of #MSDhoni and he opts for @ChennaiIPL to FIELD first in #MIvCSK.
Watch this #TATAIPL ⚔️, LIVE & FREE on #JioCinema across all telecom operators.#IPL2023 #IPLonJioCinema | @mipaltan pic.twitter.com/S6LAO0WU6v
— JioCinema (@JioCinema) April 8, 2023
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
Comments
Please login to add a commentAdd a comment