ఐపీఎల్-2023 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) రాత్రి 7:30 గంటలకు దిగ్గజాల పోరు జరుగనుంది. వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ మ్యాచ్‌లో తుది జట్లు ఎలా ఉంటాయని సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో పలువురు విశ్లేషకులు అంచనాల మేరకు తుది జట్లు ఇలా ఉంటాయని తెలుస్తోంది.
ముందుగా సీఎస్‌కే విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో లక్నోను ఓడించిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజవర్ధన్ హంగార్గేకర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగవచ్చు.
ముంబై విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన జట్టులో పలు మార్పులు చేసే ఆస్కారం ఉంది. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ తుది జట్టులోకి రావచ్చు. ఆర్సీబీతో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. ఒకవేళ అర్జున్ ఈ మ్యాచ్ బరిలోకి దిగితే ఇది అతని ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.
తుది జట్లు (అంచనా)..
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశపాండే, రాజవర్ధన్ హంగార్గేకర్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, కెమరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment