చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ధనాధన్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 63 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్ సాధించి శతకం వృథాగా పోయింది. అసలే పొట్టి ఫార్మాట్లో నిలకడలేమి.. అందునా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపినా ముంబై కెప్టెన్‌గా వేటు.. ‘జూనియర్’ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతూ కష్టంగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో నిజానికి ఈ సెంచరీ రోహిత్‌కు మంచి బూస్ట్ లాంటిది.
The Lone Warrior 👏
— JioCinema (@JioCinema) April 14, 2024
First IPL century by Rohit Sharma at the Wankhede 🫡#MIvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/vnf9Pbgd9v
అయితే, తన ధనాధన్ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ గెలుపునకు ఉపయోగపడకపోవడంతో రోహిత్ శర్మ చిన్నపాటి సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. చెన్నై పేసర్ మతీశ పతిరణ వేసిన ముంబై ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేయగా.. మూడో బంతికి రోహిత్ ఫోర్ బాది వంద పరుగుల మార్కును అందుకున్నాడు.
తద్వారా ఐపీఎల్-2024లో మూడో సెంచరీ(విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ తర్వాత) నమోదు చేశాడు. కానీ అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారైపోయింది. ఫలితంగా రోహిత్ ముభావంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత.. మహేంద్ర సింగ్ ధోని రోహిత్ వద్దకు వచ్చి ఓదార్చాడు.
హిట్‌మ్యాన్‌తో చేయి కలిపి అతడి వెన్నుతట్టిన తలా.. ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా రోహిత్‌ను దగ్గరికి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని, రోహిత్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా టీమిండియాలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడంలోనూ ధోనిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే.
2⃣nd win on the bounce
— IndianPremierLeague (@IPL) April 14, 2024
4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON!
Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn
ఇక వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సీఎస్‌కే స్టార్ ధోని (4 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ముంబై హీరో రోహిత్ శర్మ శతకం కూడా ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.
చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు
►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం
►టాస్: ముంబై.. బౌలింగ్
►చెన్నై స్కోరు: 206/4 (20)
►ముంబై స్కోరు: 186/6 (20)
►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28).
చదవండి: MS Dhoni: ఆ యువ వికెట్ కీపర్ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్: రుతురాజ్
Comments
Please login to add a commentAdd a comment