PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ధోని సేన.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. రుత్‌రాజ్, కాన్వే చెలరేగడంతో 17.4 ఓవర్లలో ఛేదించింది.
ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ఎంస్ ధోని స్పందించాడు. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది తలైవా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరానాపై కూడా మిస్టర్ కూల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ విజయం చాలా కీలకం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా లేవు.
కాబట్టి పాయింట్ల పట్టికలో మేము కాస్త వెనుకబడ్డాం. ఇప్పుడు మళ్లీ ఈ విజయంతో ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించాను. కానీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో నా నిర్ణయాన్ని ఆఖరి నిమిషంలో మార్చుకున్నాను. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాను. అదేవిధంగా వికెట్ కూడా చాలా నెమ్మదిగా ఉంది.
కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మా బౌలర్లు కూడా నిరూపించారు. మా పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరానా మా జట్టుకు, శ్రీలంకకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు రెడ్ బాల్ క్రికెట్ కాకుండా వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడేటట్లు శ్రీలంక క్రికెట్ చూసుకోవాలి. అతడికి అద్భుతాలు సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా అతడు గత సీజన్ కంటే ఈ సీజన్‌లో కాస్త దృఢంగా ఉన్నాడని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధోని పేర్కొన్నాడు.
చదవండి: Kris Srikkanth: రోహిత్ శర్మ కాదు 'నో హిట్ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!
Comments
Please login to add a commentAdd a comment