ఐపీఎల్ తాజా సీజన్‌లో ఇంటాబయటా ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్సే ఆధిపత్యం కొనసాగించింది. నెల రోజుల క్రితం ముంబైని మరాఠా వేదికపై ఓడించిన ధోని సేన, ఇప్పుడు దాదాపు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. పైగా వరుసగా గత ఆరు సార్లు చెపాక్ మైదానంలో ముంబై చేతిలో ఎదురైన పరాజయాలకు ఈ గెలుపుతో బ్రేక్ వేసింది.
చెన్నై: ఐపీఎల్‌లో హేమాహేమీ జట్లు ముంబై, చెన్నై మధ్య వరుసగా మరో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. శనివారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట రోహిత్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. నేహల్ వధేరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశ పతిరణ (3/15) దెబ్బ తీశాడు. çసూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 140 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (42 బంతుల్లో 44; 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
రోహిత్ మళ్లీ విఫలం
ముంబై బ్యాటింగ్‌కు దిగడంతోనే కష్టాల్లో కూరుకుపోయింది. గ్రీన్ (6), ఇషాన్ (7), రోహిత్ (0)లు 14 పరుగుల స్కోరుకే పెవిలియన్‌లో కూర్చున్నారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్‌వర్మ స్వల్ప గాయంతో బరిలోకి దిగలేకపోవడంతో మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మళ్లీ డకౌటయ్యాడు. సూర్యకుమార్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు) తర్వాత స్టబ్స్ (21 బంతుల్లో 20; 2 ఫోర్లు)తో నేహల్ వధేరా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. 123/4 స్కోరు దాకా బాగానే ఉన్నా... 14 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది.
చెన్నై సులువుగా...
చెన్నై ముందున్న లక్ష్యం 140 పరుగులు. ఇందులో సగంకంటే ఎక్కువ పరుగుల్ని ఓపెనర్లు రుతురాజ్, కాన్వే చేసేయడంతో ఛేదనలో సూపర్‌కింగ్స్ సాఫీగా సాగిపోయింది. కాన్వే నింపాదిగా ఆడుకుంటే... రుతురాజ్ ధాటిని ప్రదర్శించాడు. తర్వాత రహానె (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (12) తక్కువ స్కోర్లే చేసినా చెన్నైపై ఇదేమంత ప్రభావం చూపలేదు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గ్రీన్ (బి) తుషార్ 6; (బి) ఇషాన్ (సి) తీక్షణ (బి) చహర్ 7; రోహిత్ (సి) జడేజా (బి) చహర్ 0; నేహల్ (బి) పతిరణ 64; సూర్యకుమార్ (బి) జడేజా 26; స్టబ్స్ (సి) జడేజా (బి) పతిరణ 20; డేవిడ్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 2; అర్షద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 1; ఆర్చర్ నాటౌట్ 3; చావ్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–69, 5–123, 6–127, 7–134, 8–137.
బౌలింగ్: దీపక్ చహర్ 3–0–18–2, తుషార్ 4–0–26–2, జడేజా 4–0–37–1, అలీ 1–0–10–0, తీక్షణ 4–0–28–0, పతిరణ 4–0–15–3.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) ఇషాన్ (బి) చావ్లా 30; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్ 44; రహానె (ఎల్బీ) (బి) చావ్లా 21; రాయుడు (సి) గోయల్ (బి) స్టబ్స్ 12; దూబే నాటౌట్ 26; ధోని నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–46, 2–81, 3–105, 4–130.
బౌలింగ్: గ్రీన్ 1–0–10–0, ఆర్చర్ 4–0–24–0, అర్షద్ 1.4–0–28–0, చావ్లా 4–0–25–2, రాఘవ్ 4–0–33–0, స్టబ్స్ 2–0–14–1, ఆకాశ్ 1–0–4–1.
16: ఐపీఎల్‌లో రోహిత్ డకౌట్లు. ఎక్కువ సార్లు ‘సున్నా’ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు.
IPL 2023: చెన్నై ‘డబుల్’ ధమాకా
Published Sun, May 7 2023 5:39 AM | Last Updated on Sun, May 7 2023 5:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment