beat
-
అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
డబ్బు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే. మనకు తెలిసిన చాలామంది, మరీ ముఖ్యంగా జీతం తీసుకుంటున్నవారు తరచూ అప్పులు చేయడం గమనిస్తుంటాం. బాధ్యతా రహితంగా డబ్బు తీసుకుంటే భవిషత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు చేస్తున్న చాలామందికి దాని తీవ్రత తెలియక మళ్లీ అదే పనిచేస్తుంటారు. అప్పు ఉచ్చులో చిక్కుకుంటున్నామని సూచించే కొన్ని సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రమంగా అప్పుల్లోకి జారుకుంటున్నారని తెలుసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఈజీ ఈఎంఐలు, డిస్కౌంట్లు, సేల్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చుతో ఇబ్బందులు తప్పవు. అప్పు మిమ్మల్ని మరింత ఊబిలో పడేస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాలంటే మాత్రం వచ్చే ఆదాయంలో ఈఎంఐలు 50శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.రోజువారీ ఖర్చుల కోసం అప్పురోజువారీ ఆర్థిక అవసరాల కోసం తరచు అప్పు తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులకు అప్పు తీసుకుంటే రుణఊబిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.క్రెడిట్ కార్డుతో జాగ్రత్తతీసుకున్న అప్పులను తీర్చడానికి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్ వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.పేమెంట్లను చెల్లించకపోవడంక్రెడిట్ కార్డ్ డ్యూ డేట్‌లోపు పేమెంట్ చెల్లించాలి. అందులో మినిమం డ్యూ కడితే సరిపోతుందనుకోవద్దు. మిగిలిన డ్యూ మొత్తాన్ని నెలవారీగా వడ్డీ విధిస్తారు. అది మరింత ప్రమాదకరం. దాంతో మీ సిబిల్ స్కోర్ ప్రభావం చెందుతుంది. ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. ఈ రోల్ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి.భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై అప్పుభవిష్యత్తులో ఫలానా వారు డబ్బు ఇస్తారనో.. లేదా ఈ సంవత్సరం చివర్లో బోనస్ వస్తుందనో ఇప్పుడే అప్పు తీసుకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు.ఇంక్రిమెంట్లను నమ్మొద్దుభవిష్యత్తులో వచ్చే జీతం, ఇంక్రిమెంట్లను ఎక్కువగా అంచనా వేస్తారు. కెరీర్ ప్రారంభ దశల్లో ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి రిటైర్మెంట్ వరకు కొనసాగకపోవచ్చు. కాబట్టి కనిపించని భవిషత్తుపై అంచనాలతో ప్రస్తుతం అప్పులు చేయడం తప్పు.ఫ్లోటింగ్ వడ్డీ రేట్లుఉద్యోగంలో చేరిన వెంటనే చాలామంది అడిగేప్రశ్న.. ‘ఇల్లు ఎప్పుడు కొంటారు’ అని.. దాంతో స్థోమతకు మించి అప్పు చేసైనా సరే ఇల్లు కొనాలనుకుంటారు. దీర్ఘకాల వ్యవధికిగాను హోమ్లోన్లను ఎంచుకునేప్పుడు ఫ్లోటింగ్ రేట్లును సెలక్ట్ చేసుకుంటారు. దాంతో వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం మంచిది.లోన్ తీర్చడానికి మళ్లీ అప్పువడ్డీ ఖర్చులను తగ్గించడానికి, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి కోసం తప్పా..అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా హోంలోన్, కారు లోన్ ఈఎంఐలు, అద్దె, పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్‌లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు. -
IND Vs ENG 5th Test Photos: టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ 83వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12 న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం. పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ (బారామతి)లో సీనియర్ అధికారి. గోవింద్‌రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదా బాయి వామపక్ష భావాలు కలిగిన కలిగిన రాజకీయ, సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ. రాజ్‌కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకే ఆరోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. ‘మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా, నాన్నకు దూరంగా ఉండేవాళ్లం. చదువులో నా రికార్డు సరిగా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్‌పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్టు కార్డుపై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్‌పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా.. మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
జార్ఖండ్‌లోని రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! -
ఛీ.. వీళ్లేం స్నేహితులు.. బర్త్‌డే అని పిలిచి గొడ్డుని బాదినట్లు
మానవ సంబంధాలలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక దీని గొప్పతనాన్ని చూపిస్తూ సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. రక్త సంబంధం ఉన్న వారితో పంచుకోలేనివి కూడా స్నేహ బంధం ఉన్నవారితో పంచుకుంటాం. అంతటి ప్రత్యేక గుర్తింపు ఉంది కనుకే... దీనికి గుర్తుగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి మాటలు వినడమే తప్ప.. కంటికి కనిపించే ఘటనలు చాలా అరుదనే చెప్పాలి. ఇటీవల రోజుల్లో చాలా మంది అవసరం, అవకాశం కోసం మాత్రమే స్నేహం చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చిన్న చిన్న కారణాలతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్లు కొందరైతే.. దెబ్బలాడుకునే వాళ్లు ఇంకొందరు ఉన్నారు. వీళ్లంతా ఒకవైపు అయితే మరికొందరు స్నేహితులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాళ్లున్నారు. ఈ తరహాలోనే పుట్టినరోజు అని పిలిచి తమ ఫ్రెండ్‌ని చితకబాదారు కొందరు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన మదనపల్లెలో చోటు చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఓ కుర్రాడిని తన స్నేహితులు.. పుట్టిన రోజు పార్టీ ఉందని పిలిపించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ కుర్రాడు వెళ్లగానే.. అతనిపై తన మిత్రులు దాడికి దిగారు. ఫ్రెండ్ అని మరిచి విచక్షణారహితంగా చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఆ కుర్రాడు... తనను కొట్టద్దు అని కాళ్లావేళ్లా పడ్డా, వాళ్లు కనికరం లేకుండా అతడిని గొడ్డుని బాదినట్లు బాదారు. కాగా ఆ బ్యాచ్ తమ ఫ్రెండ్‌పై ఈ రకంగా దాడి చేయడానికి కారణం.. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అని చెప్పాడంట. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
IPL 2023: చెన్నై ‘డబుల్’ ధమాకా
ఐపీఎల్ తాజా సీజన్లో ఇంటాబయటా ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్సే ఆధిపత్యం కొనసాగించింది. నెల రోజుల క్రితం ముంబైని మరాఠా వేదికపై ఓడించిన ధోని సేన, ఇప్పుడు దాదాపు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. పైగా వరుసగా గత ఆరు సార్లు చెపాక్ మైదానంలో ముంబై చేతిలో ఎదురైన పరాజయాలకు ఈ గెలుపుతో బ్రేక్ వేసింది. చెన్నై: ఐపీఎల్లో హేమాహేమీ జట్లు ముంబై, చెన్నై మధ్య వరుసగా మరో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. శనివారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట రోహిత్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. నేహల్ వధేరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశ పతిరణ (3/15) దెబ్బ తీశాడు. çసూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 140 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (42 బంతుల్లో 44; 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రోహిత్ మళ్లీ విఫలం ముంబై బ్యాటింగ్‌కు దిగడంతోనే కష్టాల్లో కూరుకుపోయింది. గ్రీన్ (6), ఇషాన్ (7), రోహిత్ (0)లు 14 పరుగుల స్కోరుకే పెవిలియన్‌లో కూర్చున్నారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్‌వర్మ స్వల్ప గాయంతో బరిలోకి దిగలేకపోవడంతో మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మళ్లీ డకౌటయ్యాడు. సూర్యకుమార్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు) తర్వాత స్టబ్స్ (21 బంతుల్లో 20; 2 ఫోర్లు)తో నేహల్ వధేరా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. 123/4 స్కోరు దాకా బాగానే ఉన్నా... 14 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. చెన్నై సులువుగా... చెన్నై ముందున్న లక్ష్యం 140 పరుగులు. ఇందులో సగంకంటే ఎక్కువ పరుగుల్ని ఓపెనర్లు రుతురాజ్, కాన్వే చేసేయడంతో ఛేదనలో సూపర్‌కింగ్స్ సాఫీగా సాగిపోయింది. కాన్వే నింపాదిగా ఆడుకుంటే... రుతురాజ్ ధాటిని ప్రదర్శించాడు. తర్వాత రహానె (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (12) తక్కువ స్కోర్లే చేసినా చెన్నైపై ఇదేమంత ప్రభావం చూపలేదు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గ్రీన్ (బి) తుషార్ 6; (బి) ఇషాన్ (సి) తీక్షణ (బి) చహర్ 7; రోహిత్ (సి) జడేజా (బి) చహర్ 0; నేహల్ (బి) పతిరణ 64; సూర్యకుమార్ (బి) జడేజా 26; స్టబ్స్ (సి) జడేజా (బి) పతిరణ 20; డేవిడ్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 2; అర్షద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 1; ఆర్చర్ నాటౌట్ 3; చావ్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–69, 5–123, 6–127, 7–134, 8–137. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–18–2, తుషార్ 4–0–26–2, జడేజా 4–0–37–1, అలీ 1–0–10–0, తీక్షణ 4–0–28–0, పతిరణ 4–0–15–3. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) ఇషాన్ (బి) చావ్లా 30; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్ 44; రహానె (ఎల్బీ) (బి) చావ్లా 21; రాయుడు (సి) గోయల్ (బి) స్టబ్స్ 12; దూబే నాటౌట్ 26; ధోని నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–105, 4–130. బౌలింగ్: గ్రీన్ 1–0–10–0, ఆర్చర్ 4–0–24–0, అర్షద్ 1.4–0–28–0, చావ్లా 4–0–25–2, రాఘవ్ 4–0–33–0, స్టబ్స్ 2–0–14–1, ఆకాశ్ 1–0–4–1. 16: ఐపీఎల్లో రోహిత్ డకౌట్లు. ఎక్కువ సార్లు ‘సున్నా’ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. -
ఉన్మాదిగా మారిన భర్త..డంబెల్‌తో భార్య తలను..
సాక్షి, కృష్ణరాజపురం: కుటుంబ గొడవలతో ఇనుప డంబెల్‌తో భార్యను కొట్టి చంపాడో కిరాతక భర్త. జీవితాంతం తోడు నీడగా చూసుకుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి దారుణంగా బలిగొన్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురం పరిధిలోని రామ్మూర్తినగరలో ఉన్న హొయ్సళ స్ట్రీట్‌లో గురువారం చోటు చేసుకుంది. లిడియా (44) భర్త చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యురాలు. వివరాలు.. మోరిస్, లిడియాలకు 15 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మోరిస్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఉదయం ముగ్గురు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తరువాత భార్యభర్త గొడవపడ్డారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన మోరిస్ ఇనుప డంబెల్‌ను తీసుకుని భార్య తలను నుజ్జు చేశాడు. రక్తపుమడుగులో ఆమె శవమైంది. ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో రామ్మూర్తినగర పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో పిల్లలు అనాథల్లా మారారు. (చదవండి: బెంగళూరులో దారుణం.. వేధింపులు తాళలేక వైద్యురాలు ప్రియాంశి మృతి) -
జపాన్ లో బాహుబలి -2 రికార్డును తుడిచేసిన RRR
-
తప్పతాగి మహిళా పేషెంట్‌ని చితక్కొటిన డాక్టర్!
చత్తీస్‌గఢ్: మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన కోర్బాలోని చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గెర్వాని గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్థరాత్రి ఆరోగ్యం బాగోకపోవడంతో అంబులెన్స్‌కి కాల్ చేశాడు. ఐతే అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్ తన తల్లిని ఆటోరిక్షాలో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐతే డాక్టర్ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయ్యి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు. ఐతే సదరు డాక్టర్ శ్యామ్‌ని సైలెంట్‌గా ఉండు అంటూ అతని తల్లిని పదే పదే కొడుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌కి షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ మేరకు మెడిక్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ మిశ్రామ్ సదరు డాక్టర్‌కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. महिला पर डॉक्टर ने की थप्पड़ों की बारिश#korba #Chhattisgarh pic.twitter.com/tdehhmz8t0 — Nayabharat News (@NayabharatLive) November 9, 2022 (చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి) -
అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!
క్రైమ్: తోటలోంచి జాంకాయను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకున్ని ఘోరంగా హింసించి చంపారు. ఈ ఘటనలో బాధితుడు దళితుడు కాగా, స్థానికుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమాష ఘటన యూపీలోని అలీగఢ్ జిల్లాలో శనివారం జరిగింది. 20 ఏళ్ల ఓం ప్రకాశ్ అడవి నుంచి తిరిగొస్తూ.. జాంపళ్ల తోట వద్ద కింద పడున్న ఓ పండును తీసుకుని తినబోయాడు. అయితే అది గమనించిన తోట యజమానులు భీంసేన్, భన్వారీలు దొంగతనం చేశాడేమో అనే అనుమానంతో అతన్ని దారుణంగా హింసించారు. తాను దొంగతనం చేయలేదని, కిందపడితే తీసుకున్నానని బాధితుడు కాళ్ల మీద పడ్డా కూడా ఆ మూర్ఖులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని కేకలు విని.. జనం గుమిగూడారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మధ్యలోనే అంతా చూస్తుండగానే.. దుడ్డుకర్రలు.. చేతికి దొరికిన వస్తువులతో స్పృహ తప్పేదాకా ఓం ప్రకాశ్‌ను చితకబాదారు. గాయాలతో పడి ఉన్న అతన్ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఘటనపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇదీ చదవండి: నేరాలు.. ఘోరాలు.. చూసి ఇంట్లోవాళ్లనే! -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ, సందేశాత్మకం, డ్యాన్స్, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్ సమీపంలో కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది -
తల్లిప్రేమ ముందు పులి ఎంత!
పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది... మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాలోని బందవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు! కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది. ఈసారి మాత్రం చీమ కుట్టలేదు. పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే... ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది. అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది! తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘ఒక పులి టైగర్ రిజర్వ్ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు. ‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. ‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు. ‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి. ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు. ‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా. చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు. -
‘నాది మూఢనమ్మకం కాదు.. ఆచారాన్ని గౌరవించడం’
అహ్మదాబాద్: గుజరాత్ మంత్రి అర్వింద్ రైయానీ మూఢనమ్మక విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని తన సొంతూళ్లో గురువారం జరిగిన ఉత్సవం సందర్భంగా ఆయన ఇనుప గొలుసులతో కొట్టుకుంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో ఒక మంత్రి మూఢనమ్మకాలను ప్రొత్సహిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. చుట్టూ కొందరు నోట్లు విసురుతుంటే.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి పోటీగా అర్వింద్ సైతం గోలుసులతో వీపులో బాదుకున్నారు. అయితే విమర్శలను మంత్రి సున్నితంగా తిప్పికొట్టారు. ‘ఏటా మా సొంతూళ్లో మా కుటుంబసభ్యులంతా కలిసి కులదైవానికి ఉత్సవం జరుపుతుంటాం. చిన్ననాటి నుంచి ఆ దేవత భక్తుడిని నేను. ఉత్సవం సమయంలో గొలుసులతో కొట్టుకున్నా. మా ఆచారాలను గౌరవిస్తాను. పూజల్లో భాగంగా చేపట్టే ఈ కార్యాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రెండింటికి తేడా తెలియదని గట్టి కౌంటరే ఇచ్చారు ఆయన. રાજકોટ: રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી માતાજીનો માંડવામાં ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/hDJNbcqr6E — Gujarat Mirror (@gujaratmirror26) May 27, 2022 -
ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్‌ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్‌కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
రాజేంద్రనగర్‌లో ఆటోడ్రైవర్ వీరంగం.. మహిళలపై దాడి
Rajendranagar: టో ట్రాలీని నెమ్మదిగా వెళ్లమని సూచించినందుకు డ్రైవర్ ఇద్దరు మహిళలతో పాటు మరో యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో శనివారం ఈ విషయం బయటకు వచ్చింది. హైదర్‌గూడకు చెందిన చందు తన ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో ఈశ్వర్ థియేటర్ లైన్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఓ ఆటో ట్రాలీలో వస్తూ వారి పక్క నుంచి కట్ కొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న మహిళలు నెమ్మదిగా వెళ్లమని తెలపడంతో ఆటో డ్రైవర్ వాగ్వాదానికి దిగి మొదట చందుపై దాడి చేశాడు. అనంతరం అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు శనివారం వైరల్ కావడంతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కొందరు మహిళలు అతడిని అడవిలో..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని(46) కొంత మంది మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. సదరు వ్యక్తి ఓ హత్య కేసులో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలవడం గమనార్హం. వివరాల ప్రకారం.. త్రిపురలోని ధలై జిల్లాలోని గండెచెర్ర పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారీగా మహిళలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక కేకలు వేయగా.. నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం సదరు బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గండెచెర్ర-అమర్పూర్ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలోనే నిందితుడిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారన్న విషయం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి మహిళందరూ తీవ్రంగా కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
"భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!
Malaysian female minister Said husbands to 'gently' beat 'unruly' wives: అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మాట్లాడేటప్పుడూ కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. ఇక్కడొక మహిళా డిప్యూటీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయంలోకెళ్తే... మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేసియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా క్రమశిక్షణ నిమిత్తం వారిని సున్నితంగా కొట్టాలని కూడా చెప్పారు. అందువల్ల అతను తన భార్య ఎంతగా మారాలనుకుంటున్నాడో ఆమెకు స్పష్టంగా తెలుస్తుందని కూడా మహిళా డిప్యూటీ మంత్రి సిటి జైలా మహ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు మదర్స్ టిప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు కూడా. ‘మొండిగా వ్యవహరిస్తున్న భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అలా కుదరనప్పుడూ సున్నితంగా వారిని కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండండి. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల’ని భర్తలకు మహ్మద్ యూసఫ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
నిజామాబాద్ జిల్లా: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులు
-
యజమాని పైశాచికం.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకిన యువకుడు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూర్ లో తాను నర్మదా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని.. వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నానన్నాడు. అయితే అక్కడ ఇష్టంలేక పని మానేయడంతో.. పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ తనను చితకబాదినట్టు యువకుడు వాపోయాడు. -
వరుడ్ని చితకబాదిన వధువు బంధువులు.. అసలు ఏం జరిగిందంటే..
లక్నో: వరకట్న వేధింపులు అనేవి పురాతన కాలం నుంచి ఆడపిల్లలను, వారి తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య. ఇవే వేధింపులు ఎక్కువగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వరుడు అదనపు కట్నం కావాలని అడిగినందుకు పెళ్లి మండపలోనే వధువు తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ముందు చెప్పిన దానికంటే వరుడి తండ్రి కట్నంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. అయితే వధువు కుటుంబీకులు ఇప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారు. అయితే అది సరిపోదని తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ వరుడు తండ్రి పట్టుబట్టారు. పెండ్లి సజావుగా జరగాలని వధువు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అందరు చూస్తుండగానే ఆ వరుడిని చితకబాదారు. ఇదంతా కొందరు వీడియోలో చిత్రీకరించగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి వరుడి కుటుంబం కేసు నమోదైంది. చదవండి: Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు -
వైరల్: రూ.5 గొడవ.. చాయ్‌వాలాని చితకబాదేసిన యువతి.. అడ్డొచ్చిన వారిని..
భోపాల్: మనకిష్టమైన వాళ్లని ఎవరు ఏమన్నా ఒప్పుకోలేము. అలాంటిది ఏకంగా కొట్టాడని తెలిస్తే తట్టుకోగలమా. అలా కొట్టిన వాళ్ల బ్యాండ్ మోగించేంతవరకు మన మనసు మన దగ్గర ఉండదు. సరిగ్గా ఇలానే ఓ యవతి తన తండ్రిని అకారణంగా కొట్టిన టీ యజమానిపై శివంగిలా విరుచుకుపడి చితకబాదేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. శివపురిలోని దినారా పట్టణంలో నివసిస్తున్న తేజ్ సింగ్ పరిహార్ హైవే సమీపంలోని ఓ దుకాణంలో టీ తాగాడు. టీ తాగిన తర్వాత అతను రూ.5 చెల్లించినప్పటికీ టీ షాపు యజమాని బురా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తేజ్ సింగ్‌ను బురా కొట్టాడు. ఈ బాధతో తేజ్ సింగ్ ఇంటికి చేరుకోగా, అతని కుమార్తెకు జరిగిన విషయం తెలిసింది. ఆ అమ్మాయి తన తండ్రిని కొట్టిన విషయం తెలియడంతో కోపంతో ఊగిపోయి కర్రతో దుకాణానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే టీ షాపు యజమానిని చితకబాదేసింది. అయితే దుకాణం సమీపంలోని ప్రజలు గుమిగూడి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువతి వారిని కూడా లెక్క చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి చేసిన పనికి మెచ్చకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Madhya Pradesh: A shopkeeper beat up an elderly person for Rs 5 of tea. After which the daughter of the victim reached the shop and beat up the shopkeeper in Dinara town, Shivpuri. The video of the incident is going viral on social media. pic.twitter.com/BN359YiU15— Free Press Journal (@fpjindia) December 9, 2021 చదవండి: Groom On Bahubali Throne: పెళ్లిలో బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్ -
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
పది నెలల చిన్నారిపై ఆయా పైశాచికత్వం.. గుక్కపట్టి ఏడుస్తున్నా
కోల్‌కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్‌కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు. (చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత -
మాస్క్ పెట్టుకోలేదని జవాన్‌ను కొట్టి.. కాలుతో తన్నిన పోలీసులు
పట్నా: మాస్క్ పెట్టుకోలేదని భారత జవాన్ని జార్ఖండ్ పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన ఛాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ముగ్గురు పోలీసు సిబ్బందిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసులు చితకబాదిన జవాన్‌ను పవన్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఓ ప్రాంతంలో పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఆరా-భూసాహి గ్రామానికి చెందిన యాదవ్ తన బైక్‌పై ఆ రూట్లో వెళ్తున్నాడు. మాస్క్ లేకపోవడంతో పోలీసులు యాదవ్‌ని అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఓ పోలీసు దురుసుగా బైక్ తాళాలు లాక్కోగా యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు అతడిని రౌండప్ చేసి కొట్టడమే కాకుండా కాలుతో కడుపులో తన్నారు. ఆశ్చర్యమేమంటే జవాన్ని కొడుతున్న పోలీసులకు కూడా మాస్క్ లేదు. చివరికి గ్రామస్థులు జోక్యం చేసుకోవడంతో జవాన్‌ను మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R — VR (@vijayrampatrika) September 2, 2021 చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
కన్న కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించడమే గాక..
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): తన తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తూ కొడుతున్నాడంటూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడికుంటలో నివసించే ఓ యువతిని ఈ నెల 14వ తేదీ ఉదయం తండ్రి మహ్మద్ యూసుఫ్, పిన తండ్రి ఫరూఖ్ ఇద్దరూ కలిసి కొట్టారని అడ్డు వచ్చిన తల్లి అమీష, సోదరి ఫర్హీదపై కూడా దాడి చేశారని ఆరోపించింది. కొంత కాలంగా తనతో పాటు తల్లీ, సోదరిని మానసికంగా వేదిస్తున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ప్రేమ పెళ్లి.. యువకుడిపై యువతి బంధువులు దాడి
-
80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం.. సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేసింది. వివరాలు.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్ వెలుపల పడుకుని ఉంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దెబ్బల వర్షం కురిపించాడు. సదరు గార్డు ఏ మాత్రం కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టడమే కాక కాలితో తన్నాడు. పాపం ఆ ముసలవ్వ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు వేసింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప గార్డును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. (కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు) ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. అంతేకాక సదరు గార్డ్ సంజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆస్పత్రి యాజమాన్యం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం అన్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి
లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
మహిళపై టీడీపీ నాయకుల దాడి
సాక్షి, కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రంలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి ...కుందుర్పికి చెందిన జలజమ్మకు మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టా ఇచ్చారు. సదరు స్థలంలో టీడీపీ మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప తమిళనాడుకు చెందిన మీనాక్షి అనే మహిళ నుంచి కొనుగోలు చేసి పట్టా పొందిన్నట్లు సృష్టించుకున్నాడు. టీడీపీ అధికారంలో ఉనప్పుడు సర్వేనంబర్ 222లో పెద్ద నరసింహప్ప కుటుంబ సభ్యులు పట్టా తీసుకున్నారు. పట్టా పొందిన జలజమ్మ శనివారం పునాదులు వేసేందుకు సిద్దం కాగా మాజీ సర్పంచ్ నరసింహప్ప, ఆయన కుమారుడు శ్రీనివాసులు దౌర్జాన్యానికి దిగారు. మహిళ అని చూడకుండా చీర లాగి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. సదరు మహిళ కుడిచేతికి, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. దౌర్జన్యపరులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు
టీవీ దిగ్గజం ఏక్తా కపూర్ తెరకెక్కిస్తోన్న ‘ఫిక్సర్’ వెబ్ సిరీస్ నటులు, సిబ్బంది మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. నటి మహీ గిల్, నిర్మాత సాకేత్ సాహ్నీ, దర్శకుడు సోహమ్ షాతో ఇతర సిబ్బందిని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. తిగ్మాంషు ధులియా మాట్లాడుతూ.. ‘షూటింగ్ జరుగుతుండగా నలుగురైదుగురు యువకులు కర్రలతో మా దగ్గరకు వచ్చారు. ఉన్నట్టుండి మా మీద దాడి చేయడం ప్రారంభించారు. తొలుత మేం దీన్ని కామెడీగా తీసుకున్నాం. కానీ వారు నిజంగానే మా మీద దాడి చేస్తున్నారని కాసేపటి తర్వాత అర్థమయ్యింది. ఈ దాడిలో మా దర్శకుడు సోహమ్ షా కింద పడిపోయాడు.. ఓ కెమరామ్యాన్కి తీవ్ర గాయాలయ్యి రక్తం వచ్చింద’ని తెలిపారు. తమ మీద దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలుగా చెలామణి అవుతున్నారన్నారు. వారి అనుమతి లేకుండా అక్కడ షూటింగ్ చేయకూడదని సదరు గ్యాంగ్ తమను హెచ్చరించిందన్నారు ధులియా. దర్శకుడు సోహమ్ షా మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి మేం పర్మిషన్ తీసుకున్నాం. అందుకు సంబంధించి డబ్బు కూడా చెల్లించాం. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. వీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వచ్చి ఇక్కడ షూటింగ్ చేయకూడదంటూ మా మీద దాడి చేశార’ని పేర్కొన్నారు. -
కన్నకొడుకును చావబాదారు..
ఖగారియా (బిహార్) : కుటుంబ వివాదం నేపథ్యంలో కన్నకొడుకుని చంపిన ఓ జంటను బిహర్‌లోని ఖగారియా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. గొగ్రి సబ్‌డివిజన్‌లోని మహేష్‌కుంట్ గ్రామలో 28 ఏళ్ల అరవింద్ కుమార్ చురాసియాను కుటుంబ వివాదం నేపథ్యంలో తల్లితండ్రులే తీవ్రంగా కొట్టడంతో మరణించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. భార్యను వదిలేసిన చురాసియా ఇదే విషయమై తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడని, అతనికి వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి పీకే ఝా పేర్కొన్నారు. సోమవారం సైతం భార్యతో విభేదాల విషయమై తల్లితండ్రులతో గొడవపడటంతో చురాసియాను తల్లితండ్రులు తీవ్రంగా కొట్టారని సబ్ డివిజజనల్ అధికారి పీకే ఝా తెలిపారు. మహేష్‌కుంట్ పోలీస్ స్టేసన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు విచారణను చేపట్టారు. -
దొంగతనం చేశారనే అనుమానంతో..
లక్నో : దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు యువకులను ఎలక్ట్రిక్ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. అసిఫ్, ఇక్బాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం మూడు గంటల ప్రాంతంలో రాకేష్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో చొరబడి డబ్బు దొంగలించడానికి ప్రయత్నించరనే అనుమానంతో వారిని బంధించారు. అనంతరం ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టేసి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మీద దాడి చేసిన వారి మీద కేస్ ఫైల్ చేశారు. -
తిరుపతిలో రెచ్చిపోయిన టీడీపీ ఎంపీటీసీ
-
విద్యార్థిని చితకబాదిన టీచర్..వీడియో వైరల్
-
పోస్టింగ్ అందుకోవలసిన వేళ.. పోలీస్ స్టేషన్‌కి
జైపూర్ : పోస్టింగ్ ఆర్డర్ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్ దౌసా జిల్లాకు చెందిన జగ్మోహన్ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్ మోహన్ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తోంది. అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్మోహన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్ ఆర్డర్ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర కుమార్ జగ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేంద్ర కుమార్ తెలిపారు. జగ్మోహన్ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్ ఆర్డర్‌ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్ మోహన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వీడసలు మనిషేనా... పసికందుని ఆటోకేసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచోసుకుంది. భార్యభర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణ కోల్పొయి రాక్షసుడిగా ప్రవర్తించాడు. తన భార్యపై కోపాన్ని పసికందుపై చూపించాడో కసాయి తండ్రి. ఓ వ్యక్తి నెలల పసికందుని అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. పోలీసుల ఎదుటే ఈ దాష్టికానికి ఒడిగట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా శివగౌడ్ తన భార్య దుర్గాను వేధిస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడగా.. ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకొచ్చి శివగౌడ్ అక్కడే ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివగౌడ్ పరారీలో ఉన్నాడు. -
గుంటూరులో జిల్లా బాపట్లలో ‘అమ్మా’ నుషం
-
యువతిని వేధించాడని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు
-
సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని..
సాక్షి, సిరిసిల్ల: నేరళ్ల ఘటన మరువకముందే మరో దాష్టీకానికి పాల్పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. తమ అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్న ఆక్రోశంతో ఓ యువకున్ని దారుణంగా కొట్టారు. బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన సదానందం అనే యువకుడు పోలీసులు చేస్తున్న అక్రమాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ పేరుతో యువకున్ని పిలిచి తీవ్రంగా కొట్టారు. తనను వేములవాడ పోలీసులు నిర్భందించి తీవ్రంగా కొట్టారని సాక్ష్యాలతో సదానందం కోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా పోలీసుల అరాచకాలపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తప్పుబడుతున్నారు. -
దుర్భాషలాడుతూ..కాళ్లతో తన్నుతూ..
నంద్యాలవ్యవసాయం : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నంద్యాల పట్టణంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ నాయకుడి మేనల్లుడు కంకణం కట్టుకున్నాడు. మహా దీక్ష శిబిరంపై దాడి చేసి హల్చల్ సృష్టించాడు. తన వాహనానికి అడ్డయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషకు దిగాడు. శిబిరం ముందు ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుతూ న్యాయవాదులతో వాదనకు దిగాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఇద్దరు న్యాయవాదులపై చెప్పుకాళ్లతో తన్ని బీభత్సం సృష్టించాడు. అతని వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంత జరుగుతున్నా న్యాయవాదులు మాత్రం సంయమనం పాటించి అతన్ని అక్కడి నుంచి పంపించి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బార్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోమవారం మహాదీక్ష శిబిరం వద్దకు పలు ప్రజా సంఘాల, అఖిలపక్ష పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారు. వందలాది మంది శిబిరం వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నూనెపల్లె వైపు నుంచి శ్రీనివాససెంటర్ వైపు కారులో వెళ్తున్న స్థానిక టీడీపీ కౌన్సిలర్ వాకాశివశంకర్‌యాదవ్ మేనల్లుడు వేణు యాదవ్ కారు కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. సహనం కోల్పోయిన ఆయన కారుదిగి ‘‘మీ దీక్షలతో ఒరిగేముంది.. ఎవరి కోసం చేస్తున్నారు’’ అంటూ అసభ్యకరంగా తిడుతూ..శిబిరం వద్ద ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుకుంటూ న్యాయవాదులపైకి దూసుకొచ్చాడు. న్యాయవాదులు తేరుకొనేలోపే ఇద్దరిపై చెప్పుకాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించాడు. దీక్షలో కూర్చున్నవారు సైతం లేచి వచ్చే పరిస్థితి నెలకొంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక దీక్షలో కూర్చున్నవారు అయోమయానికి గురయ్యాడు. వేణుయాదవ్ వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై దుర్భాషలకు దిగారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా బూతు మాటలతో వాగ్వాదం చేశారు. చివరకు తన మనుషులను పిలిపించి దీక్షా శిబిరాన్ని తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తనతో వాగ్వాదానికి దిగినవారి అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమస్య తీవ్రతరం అవుతుండటంతో సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని వేణు యాదవ్‌ను బుజ్జగిస్తూ దీక్షా శిబిరం నుంచి పంపించారు. దీక్ష భగ్నానికి కుట్ర... గత 40రోజులుగా హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు శాంతియుత వాతావరణంలో చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు అనూహ్య స్పందన లభిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ప్రజల నుంచి సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీనిని ఓర్వలేని అధికార పార్టీ నాయకులు దీక్ష భగ్నానికి కుట్ర పన్నారని పలువురు న్యాయవాదులు సోముల నందీశ్వరరెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రతాపరెడ్డిలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటైతే సీమ వాసులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాము దీక్షలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. తమపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది గిట్టని వారి పనేనని బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ అన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే దాడి చేశారని, పోలీసులు తప్పక చర్యలు తీసుకోవాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లెస్వామిరెడ్డి అన్నారు. -
పోకిరీ తాట తీసింది...!
సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు మీద వెళ్తుంటే ‘కుక్కల్లా మొరుగుతుంటారు’.. మనమెందుకులే అని మిగతా యువతుల్లా భరించాలని ఆమె అనుకోలేదు. కొద్దిసేపు భరించింది. వెంటాడుతూ అనుచిత వ్యాఖ్యలకు దిగారు. అంతే... తట్టుకోలేకపోయింది. ఉగ్రరూపం దాల్చి ఆ పోకిరీని గల్లా పట్టి కొట్టుకుంటూ స్టేషన్‌కు ఈడ్చుకొచ్చింది. దేశరాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 25న కరోల్ బాగ్‌లోని గఫర్ మార్కెట్‌కు తన స్నేహితురాలితో ఆ యువతి వెళ్లింది. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వారిని వేధించటం మొదలుపెట్టారు. దీంతో యువతులిద్దరూ రిక్షా ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. వారిలో ఇద్దరు బైక్‌పై వాళ్ల రిక్షాను వెంబడిస్తూ కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక్క వ్యక్తి మాత్రం సదరు యువతిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి రిక్షా దిగి మరీ అతన్ని ఈడ్చి కొట్టింది. అంతటితో ఆగకుండా వాడి గల్లా పట్టి కొట్టుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఈ క్రమంలో అక్కడ గుమిగూడిన స్థానికులు కొందరు ఆమెకు సాయం చేయటం విశేషం. యువతి ఫిర్యాదు మేరకు మనీష్, అభిషేక్ అనే యువకులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో గత రెండేళ్లలో లైంగిక దాడుల కేసులు అధికమైపోయాయి. సగటున రోజుకు అయిదుకు పైగా అత్యాచార కేసులు నమోదు అవుతున్నట్లు ఢిల్లీ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సుమారు 3,273 కేసులు నమోదు కాగా, అందులో 650 ఈవ్‌టీజింగ్ కేసులు ఉన్నాయి. -
హీరోయిన్ ముందు పోలీస్ హీరోయిజం
-
హీరోయిన్ ముందు పోలీసాఫీసర్ హీరోయిజం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు. -
దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు
-
యువతి,యువకుడిపై పోకిరీల దారుణం
-
రేపిస్టును మహిళలు కొట్టి చంపేశారు
-
టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు...
-
టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు...
ఔరంగాబాద్ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోయి, విద్యార్థినులను వేధింపులకు గురి చేయడంతో స్థానిక శివసేన కార్యకర్తలు వారికి దేహశుద్ది చేశారు. ఔరంగాబాద్‌లో ఇద్దరు ఉపాధ్యాయులను పబ్లిక్‌గా చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానిక ఆకాష్ ఇనిస్టిట్యూట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ చదువుకుంటున్న విద్యార్ధినులతో... ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న శివసేన కార్యకర్తలు ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఫ్యాకల్టీ తీరుకు ఇనిస్టిట్యూట్ మేనేజర్ వంతపాడటంతో ఆయన పైనా చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అదరగొట్టిన హెచ్‌యూఎల్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (హిందుస్తాన్ యూనీ లీవర్) క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను మించి లాభాలను నమోదుచేసింది. లాక్మే సౌందర్య సాధనాల, బ్రూ కాఫీ వరకు ఉత్పత్తుల తయారీదారు హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ క్యూల త్రైమాసిక లాభంలో 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. నికర లాభాలు భారీగా పుంజుకుని 1,183కోట్లు సాధించినట్టు రిపోర్ట్ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇది 1,114 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం రూ.8773 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిట్టా మార్జిన్లు రూ.1738కోట్లుగా నిలిచాయి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నాలుగు శాతంగా నిలిచినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. పియర్స్, డోవ్ ఉత్పత్తుల యొక్క బలమైన విక్రయాలు సహాయపడ్డాయని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ సెగ్మెంట్ వాసలైన్ ,పాండ్స్ లాంటి బ్రాండ్ల రెవెన్యూ 8 శాతం పెరిగి రూ .4,075 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తమ ఆదాయాల్లో కీలక పాత్రపోషించిందని యాజమాన్యం ప్రకటించింది. అలాగే జీఎస్టీ ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. -
కుర్రాడిని చితక బాదిన అల్లరిమూక
-
ఆరేళ్ల బాబును రక్తం వచ్చేలా కొట్టిన తల్లి
-
సైకిల్‌పై బీట్ కానిస్టేబుళ్ల గస్తీ
కర్నూలు : గస్తీ పోలీసులు ఇకనుంచి సైకిళ్లపై పర్యటించే విధంగా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు గస్తీ పోలీసులు మోటర్‌సైకిళ్లపై కాలనీల్లో పర్యటించేవారు. అయితే ఇకపై ఈ–గస్తీలో భాగంగా సైకిళ్లపై బీట్లు తిరగడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్థానిక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆరోగ్యం కోసం పార్కులు, జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల మహిళలకు అధునాతన జనపనార బ్యాగ్ చేతికుట్టు పనులు, పోలీస్ గెస్ట్‌హౌస్‌లో టీవీలు తదితర వాటి ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కృష్ణమోహన్, సీఐ డేగల ప్రభాకర్, ఏఓ అబ్దుల్ సలాం, ఆర్ఐ రంగముని, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
హోంవర్క్ చేయలేదని..
నెక్కొండ: హోంవర్క్ చేయలేదని ఓ చిన్నారిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదిన సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. నెక్కొండ మండల కేంద్రంలోని స్నేహ ప్రగతి స్కూల్లో యూకేజీ చదువుతున్న బానోతు సిద్ధును పాఠశాల కరస్పాండెంట్ కోడూరి అశోక్ కుమార్ తీవ్రంగా దండించాడు. శనివారం పాఠశాలకు వచ్చిన చిన్నారి హోంవర్క్ చేయకపోవడంతో.. ఆగ్రహించిన అశోక్ కుమార్ తీవ్రంగా కొట్టాడు. జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆగ్రహించిన వారు పాఠశాల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని చితక్కొట్టిన టీచర్
-
స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిందని...
-
స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిందని...
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం చోటు చేసుకుంది. రంగాపురం హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న మల్లీశ్వరి తరచు స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో విసిగిపోయిన తండ్రి రాజారత్నం ఆమె తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆమె కోమాలోకి వెళ్లిందని... చెప్పడంతో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లీశ్వరి అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయం గ్రామంలో తెలిస్తే ప్రమాదమని భావించిన ఆమె తల్లిదండ్రులు మరో మహిళ సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారు. అనంతరం తండ్రి రాజారత్నం పరారైయ్యాడు. ఇరుగుపొరుగు వారు మల్లీశ్వరి గురించి ఆరా తీస్తే... బంధువుల ఇంటికి వెళ్లిందని ఆమె తల్లి చెబుతుండేది. కానీ కుమార్తె మృతి విషయం బయటకుపొక్కడంతో స్థానికులు నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మల్లీశ్వరి తల్లీతోపాటు ఆమెకు సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా తండ్రి రాజారత్నం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 22వ తేదీన చోటు చేసుకుంది. -
కౌన్సిలర్ దంపతులపై టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం
కత్తులతో బెదిరించిన యూత్ విభాగం ఫర్నిచర్, కంప్యూటర్ ధ్వంసం పార్టీకి రాజీనామా చేయకుంటే చంపుతామని బెదిరింపు సిరిసిల్ల టౌన్ : సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్ దంపతులపై టీఆర్ఎస్ యూత్ విభాగం కార్యకర్తలు తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి ఇంటిపై దాడిచేసి.. కౌన్సిలర్ భర్తను దూషించారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. 27వ వార్డు కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి భర్త సుదర్శన్ వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష కోసం పద్మశాలి అనుబంధ సంఘాల జేఏసీ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నాడు. పద్మశాలి నేతలు ప్రతిరోజూ అంబేద్కర్ చౌరస్తాలో రిలేదీక్షలు చేపడుతున్నారు. మంగళవారం సిరిసిల్లకు వచ్చిన మాజీ ఎంపీ పొన్నం, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వచ్చి దీక్షకు మద్దతు పలికారు. రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సుదర్శన్ ఆయన వాహనంపైకి చేరి జిల్లా ఆకాంక్షను వెలిబుచ్చారు. దీంతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్, మహమూద్, బాబి, వేముల గంగాధర్ మరో 20 మంది కౌన్సిలర్ ఇంటికి చేరుకుని దాడిచేశారు. పార్టీకి రాజీనామా చేయాలంటూ కత్తులతో బెదిరిస్తూ.. ఇంట్లోని అద్దాలు, కంప్యూటర్ను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్‌కే వ్యతిరేకంగా పనిచేస్తావా..? చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలి తమపై జరిగిన దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ దంపతులు కోరారు. పద్మశాలి కులస్తుల ఆకాంక్ష మేరకు తాను జిల్లా కావాలని కోరుతున్నామని, మంత్రికి, పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. దాడికి పాల్పడిన వారితో తమకు ప్రాణహాని ఉందని, వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న అఖిలపక్షం నేతలు వచ్చి కౌన్సిలర్ దంపతులను ఓదార్చారు. -
పురోహితుడిని చితకబాదిన కాలనీవాసులు
-
గుజరాత్లో దళితుల ఆందోళనలు
-
శివారుకు తీసుకెళ్లి.. ముగ్గురి బట్టలూడదీసి..
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనానికి పాల్పడ్డారని ముగ్గురు దళిత మైనర్లను ఓ గ్రూపు చితక్కొట్టింది. అది కూడా వారి బట్టలూడదీసి. దొంగతనానికి నిజంగా పాల్పడ్డారో లేదో అనే విషయం స్పష్టంగా తెలుసుకోకుండానే ఈ పనిచేశారు. ఓ ముగ్గురు దళిత మైనర్లను ఒక శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు చేతిల్లో పెద్ద కర్రలు, చెరకు గడెలు తీసుకొని వారిని కొట్టారు. ఆ వెంటనే వారి బట్టలు విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి మార్చిమార్చి కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
తమ భర్తలతో అక్రమ సంబంధం పెట్టుకుందని..!
మాస్కో: తన భర్తతో మరో మహిళ చనువుగా ఉండటాన్ని ఏ మహిళా సహించలేదు. అది ఇండియాలో అయినా.. రష్యాలో అయినా.. ఎక్కడయినా సరే. తమ భర్తలతో అక్రమ సంబంధం నడుపుతున్న ఓ మహిళపై ఇద్దరు మహిళలు తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఇద్దరు రష్యన్ మహిళలు.. ఆమెను చితకబాదారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. ఇదంతా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. క్రిమియాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. ఆ మహిళను వివస్త్రను చేసి కొట్టుకుంటూ వీధుల్లో తిప్పారు. చిన్న పిల్లలు కూడా ఉన్న ఆ వీధుల్లో మహిళపై పాశవికంగా దాడి చేయటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీసు స్టేషన్ లో భార్యపై మాజీ ఎమ్మెల్యే దాడి
బెంగళూరు: ఓ మాజీ ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు. తనను నిలదీసిన భార్యపై పోలీసు స్టేషన్ లోనే దాడిచేసిన ఘటన బెంగళూరుతో చోటు చేసుకుంది. ముదిగెరె మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి గత ఆరు నెలలుగా తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య సవిత... తల్లి, సోదరునితో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ తన భర్త పోలీసులు ఎదుటే తనపై దాడికి చేశాడని అనంతరం సవిత విలేకరులకు తెలిపింది. అయినా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనని ఇది తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని, ఆయనతో తాను జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా భర్త ఇంటికి రావడం లేదని తనను పట్టించు కోవడంలేదని అతను వేరే స్త్రీతో ఉంటున్నాడని సవిత ఆరోపించారు. దీనిపై కుమారస్వామిని ప్రశ్నించగా సవితనే ఎనిమిదేళ్లుగా తన దగ్గరకు రావడం లేదని ఇది తన కుటుంబ సమస్య అని దీనిని తాను పరిష్కరించుకుంటానని తెలిపారు. -
'భార్యలను కొట్టొచ్చు.. కొంచెం మెల్లగా'
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ మతపరమైన సంస్థ.. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో పొందుపరచిన పలు అంశాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) అనే సంస్థ ఇటీవల పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం మహిళల రక్షణకు చేసిన పీపీడబ్ల్యూఏ చట్టం సరిగా లేదని దానిస్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో మహిళలను అవసరమైతే భర్తలు కొట్టొచ్చు.. కాకపోతే కొంచెం మెల్లగా కొట్టాలంటూ సూచించింది. అంతే కాదు ఏ ఏ సందర్భాల్లో కొట్టొచ్చో సవివరంగా నివేదికలో పేర్కొంది సీఐఐ. దీనిలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే.. భర్త చెప్పిన మాటను లెక్కచేయకుండా భార్య ప్రవర్తించినప్పుడు, భర్త చెప్పిన విధంగానే డ్రెస్ చేసుకోనప్పుడు, బురఖా ధరించనప్పుడు, అపరిచితులతో మాట్లాడినప్పుడు ఇలా పలు సందర్భాల్లో భార్యను మెల్లగా కొట్టొచ్చు అంటూ ఆ నివేదికలో పేర్కోంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ తరువాత కో ఎడ్యుకేషన్ ఉండరాదని, నర్సులు పురుష పేషంట్లకు చికిత్స చేయొద్దని ఇలా పలు అంశాలతో కూడిన నివేదిక త్వరలోనే పంజాబ్ అంసెంబ్లీలో చర్చకు రానుంది. -
జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు
నోయిడా: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్ విద్యార్థులు ఈడ్చిఈడ్చి కొట్టారు. ఇనుప రాడ్లతో మోదారు. ఈ ఘటనలో 18మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే విద్యార్థులు హాస్టల్లో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ హాల్ కు తిరిగొచ్చారు. వారు అలా రాగానే.. పెద్ద మొత్తంలో సీనియర్ విద్యార్థులు తలుపులు వేసి వారిని లోపల పడేసి బాగా కొట్టారు. గంటపాటు అలా ఇష్టమొచ్చినట్లు కొట్టిన తర్వాత వారి బట్టలు విప్పేయండంటూ బలవంత పెట్టారు. సీనియర్లతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో వాళ్లు మాకు చూపించాలని అనుకున్నారు. వాళ్లు ప్రతి రోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తినే వద్ద కూడా వదిలిపెట్టడం లేదు. కవర్లలో ఆహారం దాచేసి అందులో ఏముందని అడుగుతూ అలా చెప్పకుంటే ముఖంపై విసిరేసి అవమానిస్తారు. ఇలా రోజు జరుగుతుంది' అని గాయాలపాలయిన విద్యార్థుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో సంఘటనలు జరుగుతున్నా తమకు కనీస సమాచారం అందించడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
వీధి కుక్కను కొట్టి చంపిన వ్యక్తులపై కేసు
హయత్‌నగర్: కుక్కను కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని భాగ్యలతాకాలనీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..భాగ్యలతకాలనీలో తిరుగుతున్న ఓ వీధి కుక్కను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయంపై ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నారు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టంకు తరలించారు. -
'వాడిని బూట్లతో తన్ను'
లక్నో: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను బూట్లతో తన్నాలని ఉత్తరప్రదేశ్‌లోని ఓ పంచాయతీ పెద్దలు రేప్ బాధితురాలికి సూచిస్తూ తీర్పునిచ్చారు. అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని హెచ్చరించింది. రాష్ట్రంలోని తోడల్పూర్ అనే గ్రామంలో ఓ మహిళపై ఈ నెల 19న ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనై ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం పంచాయతీ పెద్దలకు తెలియడంతో వారు విభిన్నంగా తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.ఐదు లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే, లైంగిక దాడికి పాల్పడినవారిలో ఒకరు ఆ మొత్తం చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో వారి ముఖంపై అందరూ చూస్తుండగానే ఇంకు చల్లేందుకు, బూట్లతో తన్నేందుకు ఆ పంచాయతీ బాధితురాలికి అనుమతిస్తూ తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపట్ల పలువురు సామాజిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు గాలికొదిలేయడం వల్లే పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. -
భాంగ్రా బీట్ కు కెనడా ప్రధాని స్టెప్పులు..!
ప్రజల మనిషిగా పేరొంది... కెనడా దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని జస్టిన్ ట్రూడో భాంగ్రా డ్యాన్సుతో వీక్షకుల మనసు దోచుకున్నారు. ప్రధాని హోదాలోనూ ఆయన సాధారణ వ్యక్తిగా కలసిపోయారు. సంప్రదాయ కుర్తా పైజమా ధరించి, డ్చాన్స్ ఫ్లోర్ పై నృత్యకారిణులతో పదం కలిపారు. పంజాబీ జానపద నృత్యంగా పేరొందిన భాంగ్రా డ్యాన్స్ కు లయబద్ధంగా స్టెప్పులు వేసి అందర్నీ, విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేశారు. ఇండియన్ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్ లో 43 ఏళ్ల గ్రూవింగ్ ఓ పంజాబీ పాటకు చేసిన డ్యాన్స్.. యూట్యూబ్ లో విడుదలైంది. వేదికపై జరుగుతున్న నృత్య కార్యక్రమంలో భాగంగా ఓ మహిళతో కలసి ట్రూడో.. పాటకు అనుగుణంగా పదాలు కలుపుతూ తానూ ఓ ఏస్ డ్యాన్సర్ అని నిరూపించుకున్నారు. ట్రూడో చూపించిన ఉత్సాహానికి అక్కడివారంతా ముగ్ధులయ్యారు. వారంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ఆయనతో పాటు డ్యాన్స్ లో పాలుపంచుకున్నారు. అక్టోబర్ 19న ఓ కొత్త అధ్యాయానికి తెరలేపి.. 43 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రెండో వ్యక్తి ట్రూడో. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు ఇచ్చినవారికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేరోజు మాట్రియల్లో జర్రీ సబ్వే స్టేషన్ సందర్శించిన ఆయన అక్కడికి వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. వారితో కలసి ఉత్సాహంగా తీసుకున్న సెల్ఫీలను ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. 1968 నుంచి 1979 వరకు, తిరిగి 1980 నుంచి 1984 వరకు కెనడా ప్రధానిగా ఉన్న.. కెనడా మాజీ ప్రధాని పియర్ ట్రుడో కుమారుడే.. ఈ ప్రజా వ్యక్తి జస్టిన్ ట్రుడో. -
'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'
-
'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'
ముంబయి: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమం ఓ మహిళకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ముంబయి పోలీసులు ఆమె చుట్టూ మూగి తమ చేతులకు పనిచెప్పారు. తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించడమే. దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిమజ్జనానికి ముందు జరిగే శోభాయాత్రకు కొంత సమయానికి ముందు ముంబయి నగరంలోని ఓ వీధిలో పెట్టిన గణేశ్ ప్రతిమను దర్శించుకునేందుకు ఓ మహిళ వచ్చింది. ఆమెకు తెలియక పొరపాటున వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమె చెప్పే సమాధానం కూడా వినకుండా తీవ్రంగా కొట్టి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో పలు చానెళ్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసుల తీరుపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళను చితక్కొట్టిన పోలీసులు
-
'ఇదొక యువకుల పైశాచికత్వం'
-
'ఇదొక యువకుల పైశాచికత్వం'
అహ్మదాబాద్: అది గాంధీమహాత్ముడు నడిచిన నేల. అహింస అనే ఆయుధం పుట్టిన పుణ్యభూమి.. కానీ, ఆ అహింస హింసపాలై మట్టిలో కలిసిపోయిందేమో అని అనుకోక మానదు ఈ ఘటన చూస్తే. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఎనిమిదిమంది యువకులు అంతా ఉడుకునెత్తురుతో ఉన్నవారే. కానీ అందులో సంస్కారలేమి అనే రక్తం పారుతోందనుకుంట. ఓ పాన్ డబ్బాదగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన వస్తువులు తీసుకొని డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. రోడ్డుపైకి ఈడ్చి చావు దెబ్బలు కొట్టారు. అదికూడా ఏమాత్రం దయలేకుండా పాన్ షాపులో ఉన్న అతడిని బయటకులాగి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరుగుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా చుట్టూ నిల్చుని కొందరు వ్యక్తులు చూస్తుండటం మానవత్వం ధైర్యాన్ని కోల్పోయిందో.. స్వార్థాన్ని పులుముకుందో అనిపిస్తుంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ కళ్లు చెదిరే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. -
‘నిజాంను పొగిడితే జనం కొడతారు’
పరకాల: 'నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు మేం రెడీ.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే జనం కొడతారు..' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజాం లాగే మళ్లీ జమీందారీ వ్యవస్థకు ప్రాణం పోసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏమాత్రం లేదన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీలుగా, జేబు పార్టీలుగా మారిపోయాయన్నారు. -
లంచం కాటుకు చెంప దెబ్బ
-
కోడలు కాదు రాక్షసి
-
చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్
కొడుమూరు (కర్నూలు) : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్లో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్థానిక బీసీ హాస్టల్లో చేర్పించారు. కాగా గురువారం ఉదయం హాస్టల్లో 20 రూపాయలు దొంగిలించిందనే నెపంతో ట్యూషన్ టీచర్ భాగ్య ఆ చిన్నారిని వాతలు తేలేటట్లు చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారిని చితకబాదిన ట్యూటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు వలస వెళ్లిన ప్రాంతం నుంచి తిరిగి రావాల్సి ఉంది. -
కామాందుడికి దేహశుద్ది చేసిన గ్రామస్థులు
-
కొడుకుకోసం వెళితే కొట్టి చంపారు
నావాడ(బీహార్): కన్నకొడుకును కాపాడుకునేందుకు వెళ్లిన తల్లిపై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. దాడి చేసిన వాళ్లంతా కూడా ఫుల్లుగా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కావబరి అనే గ్రామంలో సుదేశ్వరీ దేవీ అనే 60 ఏళ్ల వృద్ధ మహిళ తాగుడుకు బానిస అయిన తన కుమారుడిని రక్షించుకునేందుకు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతోంది. అతడు తాగిరావడం చుట్టుపక్కలవారితో గొడవ పడటం షరామాములైంది. అయితే, బుధవారం కూడా తాగివచ్చిన ఆమె కుమారుడు పొరుగింటివారిని ఏదో కారణంతో తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో వారంతా ఒక్కసారిగా వచ్చి అతడిపై పడి కొట్టడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న సుదేశ్వరీ తన కుమారుడిని కాపాడుకునేందుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. -
విద్యార్థినీలను వేధించిన మెరైన్ కానిస్టేబుళ్లకు దేహశుద్ధి
ప్రకాశం(సింగరాయకొండ): రైల్లో ఇంజినీరింగ్ విద్యార్థినులను ఈవ్‌టీజింగ్ చేసిన ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లకు ఆదివారం సింగరాయకొండలో స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లు నాగరాజు, షేక్ ఖాదర్‌హుస్సేన్ చీరాలలో ఎక్కారు. వీరు ఎక్కిన కంపార్టుమెంట్లో ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థినులను వేధించారు. ఒక విద్యార్థిని సింగరాయకొండ స్టేషన్లో దిగగానే కానిస్టేబుళ్లు కూడా దిగారు. దిగిన వెంటనే వారు ఆమెను నీపేరు ఏంటని అడగ్గా.. మా నాన్నగారు వస్తున్నారు ఆయన్నడగండి చెబుతారనడంతో వారు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. తరువాత కారులో వెళుతున్న ఆ విద్యార్థిని రైల్వేస్టేషన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్లో ఉన్న కానిస్టేబుళ్లను తండ్రికి చూపించి తమను వేధించిన విషయం చెప్పింది. ఈ విషయమై అడగడానికి వెళ్లిన విద్యార్థిని తండ్రి రవిబాబుపై కానిస్టేబుళ్లు తిరగబడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. తాము మెరైన్ కానిస్టేబుళ్లమని చెప్పడంతో స్థానికులు వారిని విడిచిపెట్టారు. దీనిపై సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో చెప్పినా పోలీసులు స్పందించలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ మల్లికార్జునరావును అడగగా తమకు ఫిర్యాదేమీ అందలేదని చెప్పారు.