కొట్టి చంపారు | Youth beaten to death in Agra | Sakshi
Sakshi News home page

కొట్టి చంపారు

Published Fri, Mar 13 2015 8:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

Youth beaten to death in Agra

ఆగ్రా: ఓ అమ్మాయి ముందు అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ యువకుడిని  కొట్టి చంపారు. ఈ ఘటన ఆగ్రాలోని షా గంజ్ ఏరియాలో చోటుచేసుకుంది. మొత్తం ఐదుగురిపై కేసులు నమోదవ్వగా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసుల వివరాల ప్రకారం జీతు(22) అనే యువకుడు బాగా తాగేసి ఓ అమ్మాయి తనను దాటేసుకుని వెళ్తుండగా బహిరంగంగా మూత్రం పోయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా మూకుమ్మడిగా దాడి చేయగా గుండెపోటుకులోనై అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడికి పాల్పడిన అమ్మాయి తండ్రి మరికొందరు పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement