Group Of Youth Hardly Beat Another Friend In Madanapalle, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ఛీ.. వీళ్లేం స్నేహితులు.. బర్త్‌డే అని పిలిచి.. వేడుకున్న వదల్లేదు!

Published Fri, Jun 23 2023 3:38 PM | Last Updated on Fri, Jun 23 2023 4:34 PM

Group Of Youth Hardly Beat Another Friend Video Goes Viral - Sakshi

మానవ సంబంధాలలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక దీని గొప్పతనాన్ని చూపిస్తూ సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. రక్త సంబంధం ఉన్న వారితో పంచుకోలేనివి కూడా స్నేహ బంధం ఉన్నవారితో పంచుకుంటాం. అంతటి ప్రత్యేక గుర్తింపు ఉంది కనుకే... దీనికి గుర్తుగా ఫ్రెండ్‌షిప్‌ డే కూడా సెలబ్రేట్‌ చేసుకుంటుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి మాటలు వినడమే తప్ప.. కంటికి కనిపించే ఘటనలు చాలా అరుదనే చెప్పాలి. ఇటీవల రోజుల్లో చాలా మంది అవసరం, అవకాశం కోసం మాత్రమే స్నేహం చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది.

చిన్న చిన్న కారణాలతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్లు కొందరైతే.. దెబ్బలాడుకునే వాళ్లు ఇంకొందరు ఉన్నారు. వీళ్లంతా ఒకవైపు అయితే మరికొందరు స్నేహితులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాళ్లున్నారు. ఈ తరహాలోనే పుట్టినరోజు అని పిలిచి తమ ఫ్రెండ్‌ని చితకబాదారు కొందరు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన మదనపల్లెలో చోటు చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

ఓ కుర్రాడిని తన స్నేహితులు.. పుట్టిన రోజు పార్టీ ఉందని పిలిపించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ కుర్రాడు వెళ్లగానే.. అతనిపై తన మిత్రులు దాడికి దిగారు. ఫ్రెండ్‌ అని మరిచి విచక్షణారహితంగా చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఆ కుర్రాడు... తనను కొట్టద్దు అని కాళ్లావేళ్లా పడ్డా, వాళ్లు కనికరం లేకుండా అతడిని గొడ్డుని బాదినట్లు బాదారు. కాగా ఆ బ్యాచ్‌ తమ ఫ్రెండ్‌పై ఈ రకంగా దాడి చేయడానికి కారణం.. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అని చెప్పాడంట. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

వీడియో లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement