కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె.
బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్‌పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్‌పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు.
‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు.
.. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు
పవన్, ఉదయ్‌లపై పిఠాపురం రైతుల ఫైర్
ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్‌ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment