vanga geeta
-
ఏపీలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరాు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. అలాగే, పిఠాపురంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పిఠాపురంలో అఘాయిత్యానికి గురైన దళిత బాలికను వంగా గీత బుధవారం పరామర్శించారు. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం, వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం సెంటర్లో మిట్ట మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్
-
కూటమి ప్రభుత్వానికి వంగా గీత చాలెంజ్
కాకినాడ, సాక్షి: రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని వైఎస్సార్సీపీ నేత వంగా గీత సవాల్ విసిరారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గీత గురువారం మధ్యాహ్నాం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా?. టీటీడీ లడ్డు వివాదంలో నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు.జగన్‌ను రాజకీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారు. ముందు ఆ ఆరోపణలను నిజాలు అని నిరూపించండి. అప్పుడు జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడడండి అని రాజకీయ ప్రత్యర్థులకు ఆమె సవాల్ విసిరారు. చివర్లో దేవుడితో.. టీటీడీతో ఆటలొద్దని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఆమె హెచ్చరిక జారీ చేశారు. -
పవన్ కు ఇదే నా రిక్వెస్ట్
-
ఎందుకంత నిర్లక్ష్యం.. ముందే చెప్పినా వినలేదు..
-
పిఠాపురం ముంపుకు ప్రభుత్వమే కారణం ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్కడ ?
-
వరదల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న వంగా గీత
-
వరద బాధితుల కోసం వంగా గీత సాహసం
కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె. బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్‌పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు. ‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు. .. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారుపవన్, ఉదయ్‌లపై పిఠాపురం రైతుల ఫైర్ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్‌ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్చదవండి: 'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' -
టీడీపీ నేతలకు వంగా గీత వార్నింగ్
-
అసలు ‘తల్లికి వందనం’ ఎప్పటి నుంచి ఇస్తారు?
సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్సార్సీపీ సర్కారును విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ జారీచేసిన జీఓ–29ని సరిదిద్దుతుందా? అసలు ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమలుచేస్తారు?’ అంటూ షర్మిల పోస్టుకు జతచేస్తూ ప్రశ్నించారు.అంతకుముందు.. షర్మిల తన శనివారం నాటి పోస్టులో.. ‘బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది?’ అని ఆమె తన తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్ ఇచ్చారు. -
అధికారంలో ఉంది మీరే.. పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే సమాధానం
-
పవన్.. ఆరోపణలు కాదు నిరూపించండి: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో వైఎస్సార్సీపీపై టీడీపీ కక్షపూరిత దాడులు సరికాదన్నారు మాజీ ఎంపీ వంగా గీత. అలాగే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కాగా, వంగా గీత శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దాడులు చేయడం సరికాదు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పార్టీ ఆఫీసు భవనాలను కూల్చివేశారు. రాష్ట్రంలో నిర్మాణాలు తప్ప కూల్చివేతలు ఉండవని చంద్రబాబు చెప్పారు. ముందు చంద్రబాబు ఆయన మాటపై నిలబడాలి. ప్రజల సంక్షేమం చూడండి.. అంతేకానీ ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేయకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై పదే పదే ఆరోపణలు చేయ్యడం రాజకీయాల్లో మంచి పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్‌కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్‌లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
కూటమి సర్కార్ చేసి చూపించాలి: వంగా గీత
-
వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత వంగా గీత రియాక్షన్
-
పవన్ గెలుపుపై వంగా గీత సంచలన వ్యాఖ్యలు
-
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్‌టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
పిఠాపురంలో జోరుగా పోలింగ్
-
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
సాక్షి, పిఠాపురం: అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడారు.‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా?. 5 ఏళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’ అని సీఎం జగన్ అన్నారు.చదవండి: దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్ -
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత
-
వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
నటుడు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇది నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది పక్కనబెడితే తాజాగా వైఎస్సార్సీపీ నాయకురాలు, నటి శ్యామల.. పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని కూడా అన్నారు.(ఇదీ చదవండి: పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..)'వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కల్యాణ్.. మిగతా సినిమా వాళ్లని ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. ఆమెని ఓడించడం ఎవరి వల్ల కాదు. గీత.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆమెకు భారీ మెజారిటీ రావాలని నేను కూడా ప్రచారం చేస్తున్నాను. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యం' అని శ్యామల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు) -
పవర్ స్టార్ కు ఓటమి భయం..! వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
-
గెలవలేక దుష్ప్రచారం!
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు కోసం వక్రమార్గం పడుతున్నారు. ఇందులో భాగంగా.. జనసేన అల్లరి మూకలు కొందరు వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఆమెకు సినీ నటుడు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికొస్తే, గీత తన నామినేషన్ ఉపసంహరించుకుని జనసేనలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కుటిల రాజకీయాలకు తెరలేపారు.వంగా గీత 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీలో నామినేటెడ్ పదవులు నిర్వహించిన ఆమె.. 1996 నుంచి నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, లోక్‌సభ సభ్యురాలిగా ఓటమి ఎరుగని నాయకురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 2008 ఆగస్టు 2న ప్రకటించారు. 2013లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ప్రజారాజ్యం పారీ్ట.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వంగా గీతకు రాజకీయ భిక్ష పెట్టిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకం ప్రకారం కుట్ర కాగా, ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపు ఉన్నారని, జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని వంగా గీత చెప్పారు. ఓటమి భయంతోనే జనసేన నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణ గడువు అయిపోయాక నామినేషన్‌ను నేనెలా విత్‌డ్రా చేసుకుంటానని, ప్రజలను అయోమయానికి గురి చేయాలని పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పిఠాపురంలో ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు.