
సాక్షి, కాకినాడ: ఏపీలో వైఎస్సార్‌సీపీపై టీడీపీ కక్షపూరిత దాడులు సరికాదన్నారు మాజీ ఎంపీ వంగా గీత. అలాగే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాగా, వంగా గీత శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దాడులు చేయడం సరికాదు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పార్టీ ఆఫీసు భవనాలను కూల్చివేశారు. రాష్ట్రంలో నిర్మాణాలు తప్ప కూల్చివేతలు ఉండవని చంద్రబాబు చెప్పారు. ముందు చంద్రబాబు ఆయన మాటపై నిలబడాలి. ప్రజల సంక్షేమం చూడండి.. అంతేకానీ ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేయకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై పదే పదే ఆరోపణలు చేయ్యడం రాజకీయాల్లో మంచి పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment